Varun Sandesh Nindha : ఎన్నాళ్ళైంది అయ్యా.. సినిమాలో హైలెట్స్ ఇవే..

Varun Sandesh Nindha : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవి ఇతని ఏ మాత్రం హిట్ టాక్ ను ఇవ్వలేక పోయాయి.. అయితే ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.. ఇన్నేళ్లుకు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. వరుణ్ సందేశ్ తాజా చిత్రం నింద ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఎలా ఉందో.. అందులో ప్లస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఓ మర్డర్ మిస్టరీ కథాంశంతో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేష్ జగన్నాధం తెరకెక్కించారు.. ట్రైలర్, టీజర్స్, పోస్టర్స్ తో ఈ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశారు మూవీ టీమ్.. ఇక వరుణ్ సందేశ్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇందుకోసం మునుపెన్నడూ లేనివిదంగా ప్రమోషన్స్ కూడా చేశాడు.. ఈ రోజు సినిమా థియేటర్లలోకి వచ్చింది.. ఒక మర్డర్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో వరుణ్ హిట్ కొట్టాడా.. లేదా? సినిమాలో హైలెట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

varun sandesh nindha movie highlights
varun sandesh nindha movie highlights

ఈ సినిమాలో వరుణ్ సందేశ్ చాలా సైలెంట్ గా కనిపిస్తాడు.. ఇక మొదటి నుంచి చివరి వరకు అసలు ఎక్కడ బోర్ కొట్టించకుండా అతని పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా నటించి మెప్పించాడు… ఇక ఇంతకు ముందు తను చాలా సినిమాలు చేసినప్పటికి. అందులో లవ్ స్టోరీ సినిమాలే ఎక్కువ గా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కొత్త జానార్స్ అటెంప్ట్ చేయడం అనేది మామూలు విషయమేమి కాదు.. ఈ సినిమాలో వరుణ్ తో నటించిన ప్రతి ఒక్కరు వారి పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సంతు ఓంకార్ ఇంకొంచెం బెటర్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేయడానికి ఆయన మ్యూజిక్ అనేది కొంతవరకు డల్ అయిందనే చెప్పాలి.. మొత్తానికి సినిమా పర్వాలేదనే టాక్ ను అందుకుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు