Nindha : వరుణ్ కెరీర్ లో హైయెస్ట్ అట.? చెప్పుకోవడానికి ఓ లిమిట్ ఉండాలి భయ్యా!

Nindha : టాలీవడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ‘హ్యాపీ డేస్’ ‘కొత్త బంగారు లోకం’ వంటి హిట్ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత అతను ఒకే రకమైన లవ్ స్టోరీస్ తీయడంతో ప్రేక్షకులు అతన్ని పక్కన పెట్టారు. కెరీర్ లో దాదాపు 18 సినిమాలకి పైగా చేస్తే ఓ రెండు హిట్లు తప్ప ఏమి లేవు. ఆల్మోస్ట్ ఫేడౌట్ అయిపోయి పదేళ్ల పైనే అయింది. దీంతో అతను సినిమాలకి కూడా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కొన్నాళ్ళకి ‘బిగ్ బాస్ 3 ‘ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రియాలిటీ షో వల్ల ఇతనికి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. దీంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూశాడు. కానీ అది ఫలించడం లేదు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ ‘నింద’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా కూడా నెగిటివ్ రెస్పాన్స్ ని మూట గట్టుకుంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచడానికి ఎదో ఒకటి ట్రై చేస్తున్నారు.

Varun Sandesh's movie Nindha was a disaster at the box office

వరుణ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ అట!

అయితే వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నింద (Nindha) మూవీ ఒక సీరియస్ ఇన్వస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కగా, వరుణ్ సందేశ్ ఈ సినిమాలో బాగానే నటించాడు. అయితే సినిమా కథా, కథనాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇక వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, ఛత్రపతి శేఖర్ ల పాత్రలే సినిమాకి కీలకం. కానీ వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేదు. మిగిలిన నటీనటుల పాత్రలు అస్సలు గుర్తుండవు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ వదిలారు. నింద సినిమాకి వరుణ్ సందేశ్ కెరీర్ లో లాస్ట్ డికేడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయట. అంటే లాస్ట్ పదేళ్లలో మంచి వసూళ్లు వస్తున్న సినిమా ఇదేనని పోస్టర్స్ వేస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. పదిహేనేళ్లుగా హిట్ లేని వరుణ్ సందేశ్ సినిమాలకి అసలు కలెక్షన్లు ఏమైనా వచ్చాయా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటె సినిమాలో ఎవరున్నా, ఆదరిస్తారు. కానీ కంటెంట్ లేకపోతే ఎన్ని ప్రమోషన్లు పోస్టర్లు వేసినా లాభం లేదని అంటున్నారు జనాలు.

- Advertisement -

నవదీప్ రూట్లో వెళ్తే బెటర్?

ఇక వరుణ్ సందేశ్ చేతిలో ప్రస్తుతం సినిమాలు కూడా పెద్దగా ఏమి లేవు. అసలు వరుణ్ సందేశ్ సినిమాలు చూస్తే కెరీర్ బిగినింగ్ లో చేసిన మొదటి రెండు సినిమాలు తప్ప, వేరే ఏ హిట్స్ కూడా లేవు. ఈ క్రమంలో ప్లాప్ లు ఉన్న ఇతర హీరోల సినిమాలకి కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తున్నాయి. కానీ వరుణ్ సందేశ్ సినిమాలకి జనాలు ఏం చేసినా వెళ్లట్లేదు. ఈ క్రమంలో నవదీప్ కూడా ఫేడ్ అవుట్ అయినప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయి, స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. అలాగే వరుణ్ సందేశ్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వేరే హీరోల సినిమాల్లో నటిస్తే తన సినీ కెరీర్ కి మంచి గుర్తింపు ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి వరుణ్ సందేశ్ ఈ విషయం పై ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు