MegaFamily: మెగా అల్లుళ్లే కాదు.. వరుణ్ తేజ్ కూడా?

మెగా ప్రిన్స్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ లో పెదనాన్న చిరంజీవి ఆశీస్సులతో నాగబాబు తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ కి “ముకుంద” సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు. తోలి సినిమా యావరేజ్ గా ఆడినా, తన సినిమాల సెలక్షన్ తో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. కంచె, ఫిదా, తొలిప్రేమ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గద్దల కొండ గణేష్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కూడా కొట్టి మెగా వారసుడు అనిపించుకున్నాడు.

అయితే మెగా హీరోల్లో అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తమ చిన్నప్పుడే సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ చిరంజీవి విజేత లో, అల్లు శిరీష్ స్వాతి ముత్యం లో, అలాగే వైష్ణవ్ తేజ్, జానీ, శంకర్ దాదా mbbs, అందరివాడు చిత్రాల్లో బాలనటులు గా నటించారు. కానీ రామ్ చరణ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు. ఇక పవన్ కళ్యాణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు కానీ, హీరో కాకముందే అంజనా ప్రొడక్షన్స్ లో కొన్నాళ్ళు సహ నిర్మాత గా ఉన్నాడు. ఇక మెగా హీరో అయిన వరుణ్ తేజ్ కూడా ఒక సినిమాలో బాలనటుడిగా కనిపించాడని చాలా మందికి తెలియదు.

అదేంటంటే ప్రముఖ నటి జయసుధ మెయిన్ లీడ్ గా నాగబాబు, బ్రహ్మానందం హీరోలుగా 2000 సంవత్సరంలో “హ్యాండ్సప్” అనే సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వర రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా నటి జయసుధ ఈ సినిమాకు స్వయంగా కథ అందించి నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదే క్లైమాక్స్ లో ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా చిన్న పాత్రలో కనిపిస్తాడు. సోనూసూద్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లోనే వరుణ్ తేజ్ చిన్న పాత్రలో కనిపిస్తాడు. ఆ సినిమాలో చిరంజీవితో కలిసి రెండు నిమిషాల సీన్ ఉంటుంది.

- Advertisement -

అయితే “హ్యాండ్సప్” సినిమా ప్లాప్ కావడం వల్ల చాలా మందికి ఈ సినిమా గురించి ఇప్పటి ఆడియన్స్ కి తెలియకుండా పోయింది. ఇక మొదటి సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవితో వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం “గాండీవధారి అర్జున” సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత “భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ” నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు