Matka : కెరీర్ హైయెస్ట్ రేటుకి అమ్ముడుపోయిన వరుణ్ తేజ్ ‘మట్కా’ ఆడియో రైట్స్..

Matka : మెగా హీరో వరుణ్ తేజ్ (Varun tej) పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించిన విషయం తెలిసిందే. వరుస ప్లాపుల్లో ఉండడం వల్ల పక్కాగా హిట్ కొట్టాలని కసిగా వర్క్ చేస్తున్నాడు. ఈ ఇయర్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్ కాగా, ప్రస్తుతం తన దృష్టి మొత్తం “మట్కా” సినిమా పైనే పెట్టాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరిగి ఏడాదిన్నర పైనే అయినా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఇక మట్కా సినిమాను కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా వరుణ్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో మూడు రకాల పాత్రల్లో నటిస్తున్నాడు వరుణ్. అలాగే హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి (Meenakshi choudary), నోరా ఫతేహితో పాటు, ఓ కెనడియన్ నటి కూడా నటిస్తున్నట్టు సమాచారం.

Varun Tej's 'Matka' audio rights sold at career highest rate

కెరీర్ హైయెస్ట్ రేటుకి మట్కా ఆడియో రైట్స్..

ఇదిలా ఉండగా తాజాగా మట్కా (Matka) గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా సినిమా ఆడియో హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అందిన సమాచారం ప్రకారం ప్రముఖ బడా ఆడియో సంస్థ అయిన ఆదిత్య మ్యూజిక్ (Aditya music) వారు 3.6 కోట్లకు, వరుణ్ తేజ్ మట్కా ఆడియో రైట్స్ ని దక్కించుకున్నారని సమాచారం. ఇక వరుణ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ రేటుకి మట్కా ఆడియో హక్కులు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మట్కా సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం సరికొత్త ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడు జివి ప్రకాష్.

- Advertisement -

భారీ బడ్జెట్ తో మట్కా..

ఇక మట్కా సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. పైగా మూడు డిఫరెంట్ కాలాల్లో ఈ సినిమా నేపథ్యం ఉంటుందట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకోగా, అతి త్వరలో టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా మట్కా సినిమాని నిర్మిస్తుండగా 2025 లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు