VD12: చాలా రోజులు తరవాత హీరోయిన్స్ కామెంట్స్ లో క్యూ కట్టారు

VD12: ప్రస్తుతం వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్నాడు కానీ ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే క్రేజ్ వేరే రేంజ్ లో ఉండేది. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయాడు. ఆ సినిమా విజయ్ కాకపోతే ఇంకెవడు చేయలేడు అనే రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత చేసిన టాక్సీవాలా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన గీత గోవిందం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విజయ్ కెరియర్లో రీసెంట్ టైమ్స్ లో అన్నీ కూడా డిజాస్టర్ సినిమాలు మాత్రమే పడుతున్నాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాల్తా కొట్టాయి. ఇక ప్రస్తుతం తన కెరీర్ లో 12వ సినిమాను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నేడు రిలీజ్ చేశారు. విజయ్ ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ తోనే తెలుస్తుంది. అయితే మొదటి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే చాలామంది హీరోయిన్స్ కామెంట్ లో ఒకరి తర్వాత ఒకరు పెట్టడం మొదలుపెట్టారు. రష్మిక మందన విజయ్ ఇద్దరు ప్రేమికులు అనే విషయం తెలిసిందే.

Rashi Khanna

- Advertisement -

విజయ్ పోస్ట్ పెట్టగానే ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ మొదలుపెట్టింది రష్మిక. ఆ తర్వాత తనతో పని చేసిన రాశి కన్నా కూడా ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ పెట్టింది. ప్రస్తుతం విజయ్ ఫోటో కింద పెడుతున్న హీరోయిన్ కామెంట్స్ అన్ని కూడా వరుసగా వైరల్ అవుతున్నాయి. కేవలం ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా ట్విట్టర్ వేదిక రియాక్ట్ అయింది రష్మిక. రష్మిక కు ప్రతిస్పందనగా విజయ్ దేవరకొండ లవ్ సింబల్ ని పోస్ట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. మార్చ్ 28న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు