Vd12: లీకెడ్ పిక్ వైరల్ అవ్వడంతో అఫీషియల్ గా అప్డేట్ ఇస్తాం ఆగండి అంటూ ఫ్యాన్స్ ను వేడుకుంటున్నారు

Vd12: మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ తిన్ననూరి. మొదటి సినిమాతోనే మంచి ఫిలిం మేకర్ గా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. దాదాపు సుమంత్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో, సుమంత్ ను హీరోగా పెట్టి అద్భుతమైన హిట్టును సాధించుకున్నాడు. చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ ని అందంగా అద్భుతంగా చూపించాడు గౌతమ్ తిన్ననూరి.

తన మొదటి సినిమాలోనే గౌతమ్ రైటింగ్ స్టైల్, గౌతమ్ టేకింగ్ ఇవన్నీ కూడా ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ అనిపించాయి. వీటి అన్నిటిని మించి గౌతమ్ కి కున్న మ్యూజిక్ టేస్ట్ కూడా అద్భుతం అనిపించింది. ఈ సినిమాలో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక లో బడ్జెట్లో ఒక సినిమాను ఇంత అందంగా తీయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా మళ్లీ రావా. ఈ సినిమాతోనే ప్రముఖ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా తర్వాత గౌతమ్ చేసిన సినిమా జెర్సీ. జెర్సీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాని కెరియర్ లో ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే జెర్సీ. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించాడు గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించాడు. అనిరుధ్ అందించిన సంగీతం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అప్పటికే అనిరుధ్ పైన ఉన్న అజ్ఞాతవాసి బ్యాడ్ మార్క్ అంతటినీ కూడా జెర్సీ సినిమా మాయం చేసింది.

- Advertisement -

Vd12 Leaked Pic

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ 12వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు గౌతం. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ లీకేడ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో విజయ్ దేవరకొండ జీరో హెయిర్ కట్ తో, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. రాయన్ సినిమాలో ధనుష్ లా ఉన్నాడు. అయితే ఈ లీకెడ్ పిక్ ఇప్పుడు ఫ్యాన్స్ లో మంచి అంచనాలను నింపుతుంది. ఇదివరకు ఎప్పుడూ చూపించని రీతిలో గౌతమ్ విజయ్ ను చూపిస్తున్నాడు అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను త్వరలో రిలీజ్ చేస్తామంటూ అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు