VD12 : విజయ్ దేవరకొండ సినిమా నుండి క్రేజీ అప్డేట్.. లాంగ్ షెడ్యూల్ లో చిత్ర యూనిట్..

VD12 : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ ఇయర్ ఫ్యామిలీ స్టార్ తో డిజాస్టర్ అందుకున్నా, పెద్దగా లేట్ చేయకుండా వేరే ప్రాజెక్టులలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల్లో అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanoori) తో చేస్తున్న “VD12” అని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఇక ఈ సినిమాపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలుండగా, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నామని పలుమార్లు నాగవంశీ (Nagavamshi) చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా VD12 కి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

VD12 Project next schedule update

లాంగ్ షెడ్యూల్ జరుపుకోనున్న VD12..

విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మధ్యనే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ జరుపుకోగా, తాజాగా నెక్స్ట్ షెడ్యూల్ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. VD12 మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ని కేరళలో షూటింగ్ జరుపుతున్నట్టు సమాచారం. ఈ నెల అనగా, సెప్టెంబర్ మిడ్ వీక్ నుండి కేరళలో నెలన్నర రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నట్టు సమాచారం. ఇక ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలతో పాటు ఫైట్స్, అలాగే రెండు సాంగ్స్ కూడా షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్ తో సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

- Advertisement -

సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్..

విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న VD12 ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పోస్టర్ లో విజయ్ మాస్ అండ్ రగ్గడ్ గా కనిపిస్తూ వర్షంలో అరుస్తున్నట్టు పోస్టర్ ఉంది. ఇక ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే (Bahgyasree borse) హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇక VD12 సినిమాను 2025 మార్చ్ 28న సమ్మర్ లో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కాగా VD12 ప్రాజెక్ట్ యొక్క టైటిల్, ఇంకా టీజర్ ని దసరా కి రిలీజ్ చేస్తారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు