Veera simha reddy : గోపిచంద్ గట్టిగానే ప్లాన్ చేశాడా.?

టాలీవుడ్ అగ్ర హీరో, నటసింహం నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. బాలయ్య ఈ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇక ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది నట సింహం బాలకృష్ణనే. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు బాలయ్య కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అలాగే సింహ టైటిల్ తో వచ్చిన బాలయ్య సినిమాలు భారీ విజయాలు సాధించాయి. వీర సింహారెడ్డి లో కూడా సింహా ఉంది.

సెంటిమెంట్ ప్రకారం, ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఫ్యాక్షన్ అంటేనే ప్రేక్షకులకు మరియు ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది రాయలసీమ. ఈ సినిమా రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో రానుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. ఈ తరుణంలోనే ఈ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్లు ఉన్నట్లు ఈ వార్త సారాంశం. ఈ 11 ఫైట్లు… ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని కూడా తెలుస్తోంది. చిన్న మరియు పెద్ద ఫైట్లు కలిపి మొత్తం 11 ఉన్నాయట. దీనిని బట్టి చూస్తుంటే గోపిచంద్ మలినేని గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది.అయితే దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోండగా… వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలకపాత్రలో చేస్తున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు