Venkat Prabhu: పొలిటికల్ సినిమాలో నటించిన శివ కార్తికేయన్

Venkat Prabhu: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ దర్శకులలో వెంకట ప్రభు ఒకరు. కేవలం ప్లే బ్యాక్ సింగర్ గా, నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని, మంచి గుర్తింపును పొందుకున్నాడు. వెంకట ప్రభు 2007లో రిలీజ్ అయిన “చెన్నై 60028” అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన సరోజ, గోవా, మంకంద, బిర్యాని, మనాడు వంటి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు వెంకట ప్రభు.

వెంకట ప్రభు మొదటి చిత్రం చెన్నై 600028 ఇది చెన్నైలోని సబ్బరన్ ప్రాంతంలోని ఒక గల్లీ క్రికెట్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో అతని సోదరుడు ప్రేమ్ జే తో పాటు 11 మంది కొత్తవారు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. మంచి సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

Custody Movie

- Advertisement -

దర్శకుడుగా తెలుగులో కూడా ఎంట్రీ

వెంకట్ ప్రభు తెలుగులో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం కస్టడీ అని చెప్పొచ్చు. నాగచైతన్య నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. కానీ ఒక దర్శకుడుగా మాత్రం వెంకట్ ప్రభు కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి హిట్స్ కూడా అయ్యాయి. మానాడు సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు, ఎస్.జె. సూర్య నటించిన ఈ సినిమా చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పటికీ ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా తెరకెక్కించాడు ఆ సినిమాని వెంకట్ ప్రభు.

మరో పొలిటికల్ సినిమా

ఇకపోతే ప్రస్తుతం వెంకట్ ప్రభు విజయ్ తో ది గ్రేటెస్ట్ ఆల్ టైం అనే సినిమాని చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. పోతే ఇప్పుడు వెంకట్ ప్రభు మరో పొలిటికల్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలు శివ కార్తికేయన్ నటిస్తాడు అని విశ్వసనీ వర్గాల సమాచారం దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. మానాడు తర్వాత వెంకట ప్రభు చేయబోయే పొలిటికల్ సినిమా ఇది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు