Venkatesh: వెంకీ మామ కోసం అనిల్ భారీ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

Venkatesh.. విక్టరీ వెంకటేష్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమాలు ఎఫ్2, ఎఫ్3.. ఎటువంటి అసభ్యకర కామెడీ లేకుండా కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ఎఫ్2.. ఆరు సంవత్సరాల క్రితం విడుదలై అప్పట్లోనే భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇందులో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.. తమన్నా భాటియా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.. ముఖ్యంగా అప్పట్లో కామెడీ సినిమాలు అనగానే దిగ్గజ దర్శకులు జంధ్యాల , ఈవీవీ సత్యనారాయణ పేర్లు వినిపించేవి. అయితే ఇప్పట్లో కామెడీ సినిమాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి.. కామెడీ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించడంలో ముందుండే అనిల్ రావిపూడి.. తన డైరెక్షన్ తో ఎంతో మంది హీరోలకు సక్సెస్ ను కూడా అందించారు..

అనిల్ – వెంకీ మామ కాంబోలో ముచ్చటగా మూడోసారి..

Venkatesh: Anil has a big plan for Venky's uncle.. Will he work out..?
Venkatesh: Anil has a big plan for Venky’s uncle.. Will he work out..?

కామెడీని అద్భుతంగా డైరెక్షన్ చేయడంలో అనిల్ రావిపూడి మొదటి స్థానంలో నిలిస్తే.. ఆ కామెడీని పండించడంలో వెంకటేష్ కూడా మొదటి స్థానంలోనే ఉంటారు .. అలాంటిది ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 సెన్సేషనల్ హిట్ అయిపోయింది..ఈ కాంబినేషన్లో ఎఫ్ 3 సినిమా వచ్చినా పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మూడోసారి వీరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోందని సమాచారం. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితమే అనిల్ రావిపూడి కూడా తామిద్దరం రాబోతున్నాము అని ప్రకటించారు.. ఇక వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా మొదలైందని చిత్ర బృందం కూడా తెలియజేసింది.. ఈ క్రమంలోనే ఈ సినిమా పేరు గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. త్వరలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఒక ఆసక్తికర టైటిల్ కూడా పెట్టినట్లు సమాచారం..

సంక్రాంతికి వస్తున్నాం..

ఇక అనిల్ రావిపూడి , వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమాకి పెట్టిన టైటిల్ పేరు ఏమిటి అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’. వాస్తవానికి ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేస్తున్నామని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా.. ఇప్పుడు టైటిల్ కూడా అందుకు తగ్గట్టుగానే పెట్టాలనుకున్నారో ఏమో.. అన్నట్టుగానే సంక్రాంతికి వస్తున్నాం అంటూ టైటిల్ ని ఫిక్స్ చేశారు చిత్ర బృందం.. ఇకపోతే ప్రతి సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో ఎన్ని గొడవలు జరుగుతాయో అందరికీ తెలిసిందే .. సంక్రాంతికి విడుదల చేయాలని.. థియేటర్స్ తమ సొంతం చేసుకోవాలని.. సినీ నిర్మాతలు కూడా తెగ ఆత్రుత పడుతూ ఉంటారు.. మరి అంత కాంపిటేషన్ ఉన్న ఈ సంక్రాంతి సీజన్ పైనే టైటిల్ పెట్టాలనుకున్నారు చిత్ర బృందం..

- Advertisement -

అందుకే ఈ టైటిల్..

ఇకపోతే ఇలాంటి టైటిల్స్ పెట్టి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే పబ్లిసిటీ పరంగా కలిసి వస్తుందని ఫీలవుతున్నారట చిత్ర బృందం.. అందుకే కాస్త డిఫరెంట్ గా ఆలోచించి ఈ టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు