Venky76 : ఆ ఎక్స్ ల మధ్య మాజీ ఎక్స్.. ఇక ఆరోజునుండే స్టార్ట్…

Venky76 : టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ది ప్రత్యేకశైలి అని చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి సినిమా చేసినా, ఎలాంటి పాత్ర చేసినా దానికి సంపూర్ణ న్యాయం చేస్తారు. దర్శకులు మిస్టేక్ చేసినా, వెంకటేష్ మాత్రం ఆ సినిమాకి పాత్రకి కావల్సిన న్యాయం చేస్తారు. దానికి వెంకటేష్ రీసెంట్ గా నటించిన ‘సైందవ్’ ఉదాహరణ. సినిమా బాగా తీయలేనందుకు శైలేష్ కొలనుని అందరూ ఆడిపోసుకున్నారు గాని, వెంకటేష్ మాత్రం ఆ పాత్రకి న్యాయం చేసారు అన్నారు. అయితే వెంకీ ఎలాంటి రోల్ చేసినా, ముందు సినిమా హిట్ అయితేనే నిర్మాతకి ఏమైనా కలిసొస్తుంది. అందుకే వెంకటేష్ ఎప్పడూ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో సినిమాలు చేస్తుంటారు. ఇక లేటెస్ట్ గా వెంకటేష్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే అందరికీ నవ్వుల పువ్వులు గుర్తొస్తాయి. ఇంతకు ముందు వీరి కాంబో లో ఎఫ్ 2, ఎఫ్ 3 సిరీస్ కామెడీ డ్రామాలు ఏ రేంజ్ సక్సెస్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా వీరి కాంబోలో సినిమా రాబోతుంది.

వెంకీ76 ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్…

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం (Venky76) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా, జులై 3న ఈ సినిమాని ప్రారంభిస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. దాదాపు ఉదయం 10 గంటల సమయంలో ఈ సినిమా ఓపెనింగ్ జరుగనున్నట్టు సమాచారం. శిరీష్ సహ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతుంది. అయితే వెంకటేష్ నటించబోయే ఈ సినిమా ఈ సారి కాస్త సీరియస్ డ్రామాగా ఉండబోయే చాన్స్ ఉందని తెలుస్తుంది.

ఇద్దరు ఎక్స్ ల మధ్య నలిగిపోయే మాజీ ఎక్స్…

ఇక ఈ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ ని కూడా వదిలారు చిత్ర యూనిట్. ఆ పోస్టర్ లో మూవీ కాన్సెప్ట్ కి సంబంధించిన హింట్ వచ్చింది. అయితే ఈ సారి ఆ నవ్వులు మాత్రమే కాకుండా సీరియస్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లేట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ ని తెలియచేస్తూ ఇంతకుముందు కూడా ఓ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ ని బట్టి హీరో ఇందులో ఒక ఎక్స్ కాప్ అంటే మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ‘ ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఓవరాల్ గా స్టోరీ లైన్‌ ఇలా ఉంటుందని మేకర్స్ ముందే హింట్ ఇవ్వగా, పూర్తిగా వెంకటేష్ మార్క్ ఎంటర్టైనర్ గా, అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇక దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాలో త్రిష, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు