VenkyAnil3 : మొదలైన వెంకీ76 సినిమా షూటింగ్.. తొలి షెడ్యూల్ లో అడుగుపెట్టిన స్టార్ నటులు..

VenkyAnil3 : విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వెంకీ 76వ సినిమా తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన f2 సీరిస్ మంచి సక్సెస్ సాధించగా, ఇప్పుడు మూడో సారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా సీరియస్ యాక్షన్ మోడ్ లో సినిమాని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దిల్ రాజు నిర్మాతగా వీళ్ళ కాంబోలో సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేయగా, ఈ మధ్యనే క్యాస్టింగ్ ఫిక్స్ చేసారు. కాగా నేడు ఫైనల్ గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈరోజు ఉదయమే రామా నాయుడు స్టూడియోలో వెంకీ76 సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ మొదలుపెట్టడం జరిగింది. తాజాగా షూటింగ్ మొదలు పెడుతున్నామని మేకర్స్ ఓ వీడియోతో అధికారికంగా అనౌన్స్ చేసారు.

Venkatesh Anil Ravipudi hat trick movie VenkyAnil3 shooting has started

ఫస్ట్ షెడ్యూల్ లోనే అడుగుపెట్టిన స్టార్లు…

తాజాగా వెంకటేష్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ ఈరోజు నుండే షూటింగ్ ని మొదలు పెట్టేయగా, ఫస్ట్ షెడ్యూల్ లోనే కీలక పాత్రధారులు సెట్స్ లో అడుగుపెట్టారు. రామానాయుడు స్టూడియోలో వేసిన ఓ సెట్ లో చిత్ర యూనిట్ కి సంబంధించి వీడియో రిలీజ్ చేసారు. అందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి తో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న నరేష్, VT గణేష్ తదితరులు సెట్స్ లో అడుగుపెట్టారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సెట్స్ లో ఉన్నారు. అయితే వెంకటేష్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. బహుశా ఫస్ట్ షెడ్యూల్ లో వెంకీ లేట్ గా అడుగుపెడతారు కావచ్చు. ఇక ఈ సినిమాలో వీళ్ళతో పాటు ఉపేంద్ర లిమాయె, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -

ఎక్స్ ల మధ్య ఎక్స్ కాప్ కథ?

అయితే ఈ సినిమా కథకి సంబంధించి ఆల్రెడీ చిత్ర యూనిట్ హింట్ కూడా ఇవ్వడం విశేషం. ఆ మధ్య దీనికి సంబంధించి వీడియో ని వదలగా, అందిలో వెంకీ ఒక ఎక్స్ కాప్.. అంటే మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ‘ ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఓవరాల్ గా స్టోరీ లైన్‌ ఇలా ఉంటుందని మేకర్స్ ముందే హింట్ ఇవ్వగా, పూర్తిగా వెంకటేష్ మార్క్ ఎంటర్టైనర్ గా, అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి వైఫ్ గా నటిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు