Venkatesh: జులైలో సెట్స్ పైకి వెంకటేశ్ కొత్త సినిమా?

Venkatesh: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. అందులో కొద్ది మంది మాత్రం సక్సెస్‌ అవుతారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ సినిమాలంటే ఆసక్తిగా చూస్తారు.

ఇక ఆయన సోలో హీరోగా రాణిస్తూనే…. మరోవైపు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నాడు వెంకటేష్. ఆరంభంలో అన్ని జోనర్లలో సినిమాలు చేసిన వెంకటేష్….తర్వా త ప్రయోగాత్మక చిత్రాలతో వచ్చాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలను చేశాడు వెంకటేష్. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు కొన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగాను పేరు తెచ్చుకున్నారు.

ఇదంతా పక్కకు పెడితే… విక్టరీ వెంకటేష్ కొత్త  సినిమా గురించి ఆసక్తికర అప్డేట్‌ వచ్చింది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని ఒక హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఖరారు చేశారని సినీ వర్గాలు తెలిపాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు