Venkatesh: నెక్స్ట్ షెడ్యూల్ డేట్ ఫిక్స్ , సంక్రాంతికి రావడం ఖాయం

Venkatesh: శ్రీను వైట్ల దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా పనిచేసే పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. అయితే మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అనిల్ కి లభించాయి అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక సినిమా కూడా డిజాస్టర్ కానీ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు అని చెప్పొచ్చు. అనిల్ సినిమాలన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తాయి.

పటాస్ సినిమా తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ అనే సినిమాను చేసి మంచి హిట్టును అందుకున్నాడు. ఆ తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్ గురించి మనకు తెలియంది కాదు. అయితే రవితేజ లాంటి హీరోకి బ్లైండ్ పెట్టి ఆ సినిమాతో మంచి హిట్ కొట్టడం అనేది సాహసం అని చెప్పాలి.

Raja The Great

- Advertisement -

ఆ సినిమా తర్వాత అనిల్ చేసిన సినిమా ఎఫ్2. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమా థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించింది. నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షం కురిపించింది. అనిల్ రావిపూడి కి ఒక వంద కోట్ల మార్కెట్లో పడేసింది. ఇక్కడితో అనిల్ కి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఇప్పటివరకు అనిల్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు గాని నిలిచాయి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కూడా సినిమా చేసి హిట్ కొట్టాడు అనిల్.

Venkatesh

ఇకపోతే అనిల్ తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లోనే చేశాడు. దిల్ రాజ్ కి అనిల్ రావిపూడి కి ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలానే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా షెడ్యూల్ ఆగస్టు 9 నుంచి పొలాచ్చి లో స్టార్ట్ కానుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి వెంకటేష్ లుక్ కూడా ఫైనల్ అయిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు