Venky76 : హ్యాట్రిక్ కాంబోకి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

Venky76 : విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి ‘సైందవ్’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా నిరాశపరిచింది. వెంకటేష్ పెర్ఫార్మన్స్ ఎంత బాగున్నా, స్క్రీన్ ప్లే లోపంతో ఆ సినిమా జనాల్ని అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సారి ఎలాగైనా నిఖార్సైన హిట్టు కొట్టాలని అచ్చోచ్చిన ఎంటెర్టైన్మెంట్ జోనర్ నే నమ్ముకున్నాడు. అందుకే తనకు రెండు సక్సెస్ లు ఇచ్చిన అనిల్ రావిపూడి తో మూడోసారి జతకడుతున్నాడు. అయితే ఆ మధ్య త్రివిక్రమ్, మరియు అనుదీప్ లతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా, ఫైనల్ గా అనిల్ రావిపూడి తోనే సెట్ అయింది. ఇక ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సిరీస్ కామెడీ డ్రామాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. ఇక ఈ హ్యాట్రిక్ కాంబో అనౌన్స్ మెంట్ అయి చాలా రోజులే అయినా ఇప్పటివరకూ మొదలుపెట్టలేదు. తాజాగా వెంకీ76 కాంబోకి సంబంధించి ఓపెనింగ్ ముహూర్తం అప్డేట్ వచ్చేసింది.

Venky76 Movie Launch Ceremony Update

వెంకీ76 ముహూర్తం ఫిక్స్..

ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ మూడో సినిమా (Venky76) యొక్క ఓపెనింగ్ ప్రారంభోత్సవాన్ని జులై 3న జరపనున్నారట. అంతే కాదు ఆ వెంటనే షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక వెంకీ అనిల్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి “సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా సీరియస్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లేట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య ఈ సినిమా కాన్సెప్ట్ ని తెలియచేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక అందులో ‘ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా స్టోరీ లైన్‌ ఇలా ఉంటుందని మేకర్స్ ముందే హింట్ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ పక్కాగా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.

- Advertisement -

సంక్రాంతికి దించేందుకు ప్లాన్!

ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు దిల్ రాజు తనకు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌ లోనే సినిమాను దించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు సినిమా అనౌన్స్ మెంట్ అయినప్పుడే అధికారికంగా ప్రకటించేశారు కూడా. ఇక వెంకటేష్ కి కూడా సంక్రాంతి హీరోగా సాలిడ్ రికార్డులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతాని వదలకూడదని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడని టాక్. అందుకే ఈ సినిమాని నాలుగు నెలల్లోనే షూట్ ఫినిష్ చేయాలనీ అనిల్ రావిపూడి, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా పక్కా విలేజ్ డ్రామా నేపథ్యం కూడా ఉండబోతుందని టాక్. మరి ఈ హ్యాట్రిక్ కాంబోలో రాబోయే సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను అందుకుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు