Vennela Kishore : ఈగో కా బాప్

వెన్నెల కిషోర్.. టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ కమెడియన్ కు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లో వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు. కిషోర్ సినీ ప్రయాణం 2005లో “వెన్నెల” అనే సినిమాతో స్టార్ట్ అయింది. ఈ సినిమా వల్లే కిషోర్.. వెన్నెల కిషోర్ గా మారాడు. “వెన్నెల” తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న కిషోర్, 2009 నుంచి ట్రాక్ లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఏడాదికి కనీసం పది సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఈ ఏడాది కూడా వెన్నెల కిషోర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 2022లో ఇప్పటి వరకు వెన్నెల కిషోర్ 12 సినిమాల్లో కనిపించాడు. మరో 6 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఎఫ్ 3 సినిమాలో పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అంటూ తనకు తానే చెప్పుకున్నా.. అదే ట్యాగ్ వెన్నెల కిషోర్ కు సెట్ అయింది. కాగా ఈ ఏడాది వెన్నెల కిషోర్ పోషించిన బెస్ట్ పాత్రలలో ఒకటి గుంతలకడి గురునాథం (గురు ఈగో కా బాప్).

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా వచ్చిన తాజా సినిమా “మాచర్ల నియోజక వర్గం”. కొత్త దర్శకుడు ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించాగా, ఈ నెల 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచి కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, నితిన్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో అన్ని పాత్రలను గమనిస్తే.. ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చిన పాత్ర గుంతలకడి గురునాథం. షార్ట్ గా గురు ఈగో కా బాప్. ఈ పాత్రకు వెన్నెల కిషోర్ వందకు వంద శాతం న్యాయం చేశాడు. ఫస్ట్ ఆఫ్ లో ఈ పాత్రతో వచ్చిన కామెడీ అంతా ఇంత కాదు.

- Advertisement -

ఈగో వేరే లెవెల్లో ఉన్న వ్యక్తిగా నటించి అందరినీ మెప్పించాడు. నితిన్-కిషోర్ కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ అంటే ఏంటో నిరూపించుకునే పాత్ర వచ్చింది. ఈ పాత్రలో వెన్నెల కిషోర్ లుక్, ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా సెట్ అయ్యాయి. ఒక్కోసారి ఈ పాత్రను వెన్నెల కిషోర్ కాకుండా మరెవరూ భర్తీ చేయలేరు అన్నట్టు జీవించాడు. ఈ ఒక్క పాత్రతో వెన్నెల కిషోర్ క్రేజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు