OMG Teaser: అరుంధతి అక్కవా.. చంద్రముఖి సిస్టర్ వా.. వెన్నెల కిషోర్ కామెడీ మరోసారి రిపీట్..!

OMG Teaser: హారర్ అండ్ కామెడీ సినిమాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఒకపక్క నవ్విస్తూనే మరోపక్క భయానికి గురి చేస్తున్నారు. అప్పటి ప్రేమ కథ చిత్రం నుంచి ఇప్పటి ఓం భీమ్ బుష్ వరకు ఈ జోనర్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

ఇక తాజాగా ఇటువంటి జోనర్ తోనే ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు వెన్నెల కిషోర్. ఆ సినిమా పేరు ఓఎమ్‌జి. ఈ మూవీలో.. వెన్నెల కిషోర్, నందిత శ్వేత, షకలక శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం అనగా మే 11 వ తారీకున టీజర్ రిలీజ్ చేశారు. ” పూర్వ జన్మ జ్ఞానం తో మళ్లీ ‌ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది ” అనే డైలాగ్ తో టీజర్ ఓపెన్ అయింది.

Vennela Kishore Comedy Repeated Once Again
Vennela Kishore Comedy Repeated Once Again

” ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖికి చెల్లివైన.. కాశ్మోరా లవర్ వైన.. కాంచన కజిన్ వైనా ” అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” నేను మోహిని పిశాచి మోసం తీర్చా. కామెడీ పిశాచి కామం తీర్చా.. శంకిని పిశాచి సంక నాకా.. సంక నాకించా ” అంటూ షకలక శంకర్ కామెడీతో టీజర్ను వేరే లెవెల్ కి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు