Venu Swamy on Kalki : మళ్లీ ప్రభాస్‌తో పెట్టుకున్న వేణుస్వామి… ఈ సారి ఫ్యాన్స్ అస్సలు వదిలేలా లేరు..!

Venu Swamy on Kalki.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గత కొంతకాలంగా ప్రభాస్ గురించి జాతకాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.. ఈ విధంగా ప్రభాస్ సినిమాల గురించి జాతకాలు చెబుతూ ట్రోల్స్ అవుతున్న వేణు స్వామి మరోసారి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామికి.. ప్రభాస్ నటించిన కల్కి 2898AD గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి..

Venu Swamy on Kalki : Venu Swamy with Prabhas again... this time the fans can't let go
Venu Swamy on Kalki : Venu Swamy with Prabhas again… this time the fans can’t let go

కల్కి2898AD పై వేణు స్వామి కామెంట్స్..

ఇంటర్వ్యూలో భాగంగా కల్కి 2898AD సినిమా మంచి విజయాన్ని అందుకుంది కదా.. మరి మీ జ్యోతిష్యం తప్పింది.. ఈ విషయం పై మీ స్పందన ఏంటి..? అని యాంకర్ అడగగా.. దానికి వేణు స్వామి మాట్లాడుతూ.. తను బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు సక్సెస్ కావు అని చెప్పాను.. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో , రాధే శ్యామ్ , ఆది పురుష్ వంటి సినిమాలు సక్సెస్ కాలేదు.. మరి అప్పుడు ఎవరు అడగలేదు ఏంటి? అంటూ ప్రశ్నించారు వేణు స్వామి.

కల్కి హీరో ఎవరు..?

ఇక తర్వాత వచ్చిన సలార్ సినిమా హిట్ అయింది అని అందరూ అనుకుంటున్నారు.. కానీ ఆ సినిమాకి రూ .100 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.. ఇక ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయిందా? అసలు ఈ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్ ఎంత సేపు కనిపించారు? అంటూ ఈ సినిమా గురించి మాట్లాడారు వేణు స్వామి.. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్లు ఎంత వచ్చాయి..? ఎంత లాభాలు వచ్చాయి..? అనేది కూడా త్వరలోనే నిర్మాతలు తెలియజేస్తారు అంటూ కల్కి సినిమా గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు..

- Advertisement -

నాకు – ప్రభాస్ కు ఎటువంటి శత్రుత్వం లేదు..

అంతే కాదు వ్యక్తిగతంగా తనకు ప్రభాస్ కు మధ్య ఎటువంటి శత్రుత్వం లేదని.. ఆయన అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారని.. మా తోటలో పండే పండ్లు కూడా మేము ప్రభాస్ కి పంపిస్తూ ఉంటాము.. ఈమధ్య నేను పెట్టుకున్న కళ్ళజోడు ప్రభాస్ కి బాగా నచ్చాయని.. తన మేనేజర్ ఫోన్ చేసి మరీ వివరాలు తెలుసుకున్నారు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ తో తనకున్న రిలేషన్ గురించి కూడా మాట్లాడుతూ కామెంట్ చేశారు వేణుస్వామి.

వేణు స్వామి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

అయితే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలోనే.. కల్కి సినిమా హీరో ఎవరు?అంటూ కామెంట్లు చేయగా ప్రస్తుతం ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ను నిందించడం మానవా..? అసలు ప్రభాస్ టాలెంట్ గురించి నీకేం తెలుసు..? అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా వేణు స్వామి పై ప్రభాస్ అభిమానులు ఇప్పుడు పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు