Venu Swamy : ట్రోలర్స్ కు వేణు స్వామి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పావు సామి ..

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన సుపరిచితమే.. సినిమా వాళ్లకు జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్ ను టార్గెట్ చేస్తూ తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. ఆయన చెప్పే జాతకాలలో కొన్ని నిజం అవ్వడంతో ఒక్కసారి ఆయన సినీ, రాజకీయ రంగాల్లో సెలెబ్రేటి సెలెబ్రేటి అయ్యాడు.. అంతేకాదు చాలా మంది సినీ హీరోయిన్లకు ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.. ఇలా ఇప్పుడు సోషల్ మీడియా ఊపేస్తున్నాడు.. తాజాగా వేణు స్వామి ట్రోల్స్ చేసేవారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన- కూటమి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే..అయితే ఫలితాలు వచ్చిన రోజు నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జ్యోతిష్యుడు వేణుస్వామిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికీ మీమ్స్ పేజీల్లో వేణుస్వామిపై దారుణమైన ట్రోల్స్ కనిపిస్తున్నాయి.. మొదటి సారి ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు అయ్యింది.. ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.. తాజాగా వీటి పై ఆయన స్పందించాడు..

ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. నాపై ఎంత ట్రోలింగ్ జరిగినా ఫర్లేదు.. ఇదేమీ నాకు కొత్త కాదు. అలానే నేను ఏం భగవంతుడ్ని కాదు. నేను చెప్పిన వాటిలో 100కి 98, 99 శాతం అన్నీ జరిగాయి. ఇది నా సక్సెస్ రేటు. అయితే జరగని ఒక్క విషయానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నేను వ్యక్తిగతంగా ఒప్పకున్నాను. కానీ చాలా మంది పెద్ద జ్యోతిష్యులు,స్వామీజీలు మాత్రం ప్లేటు ఫిరాయించేశారు.. నేను అలా కాదు నాకు ధైర్యం ఉంది.. భయపడే ఛాన్స్ అస్సలు లేదని చెప్పాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు