Venu Swamy: రూట్ మార్చిన వేణు స్వామి.. నంబర్ వన్ హీరో ఆయనే..!

Venu Swamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలే కాదు రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.. అయితే ఈ మధ్యకాలంలో ఈయన చెప్పిన జాతకాలు ఏవి కూడా ఫలించడం లేదు అని చెప్పడంలో సందేహం లేదు.. గతంలో సమంత విడాకులు తీసుకుంటుందని చెప్పాడు. అన్నట్టుగానే సమంత , నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో వేణు స్వామి ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఇక ఈయనతో చాలామంది హీరోయిన్లు రాజ శ్యామల యాగం చేయించుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారు.. ఇలా ఇవన్నీ కూడా వేణు స్వామికి అప్పట్లో బాగా కలిసి వచ్చాయి.

Venu Swamy: Venu Swamy who changed his route.. He is the number one hero..!
Venu Swamy: Venu Swamy who changed his route.. He is the number one hero..!

ప్రభాస్ చిత్రాలపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..

కానీ హీరోల విషయంలో ఈయన చేసిన కామెంట్లు పూర్తిస్థాయిలో వేణు స్వామిని ఇబ్బందులకు గురి చేశాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా హీరో ప్రభాస్ కి బాహుబలి తర్వాత సినిమా కెరియర్ అచ్చిరాదు అని.. ఆయన డిజాస్టర్లు చవి చూస్తాడని చాలామంది కామెంట్లు చేశారు. ఈయన చెప్పినట్టుగానే బాహుబలి సినిమా తర్వాత ఈయన చేసిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలు బొక్క బోర్ల పడ్డాయి.. అలాగే సలార్ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని చెప్పాడు.. అయితే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ వేణు స్వామి ఇకపై జాతకాలు చెప్పకూడదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

రూట్ మార్చిన వేణు స్వామి..

ఇటీవల కల్కి సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని గతంలోనే చెప్పాడు వేణు స్వామి.. కానీ ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాదు ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.. ఇక ఈ సినిమా ఫలితం విషయంలో కూడా పూర్తిస్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి పై రకరకాల కామెంట్లు చేస్తూ బూతులు కూడా తిడుతున్న విషయం తెలిసిందే.. కానీ తాజాగా వేణు స్వామి రూట్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అంటూ చెప్పిన ఈయన ఇప్పుడు ఏకంగా ప్రభాస్ నెంబర్ వన్ హీరో అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు.

- Advertisement -

ప్రభాస్ నెంబర్ 1 అయితే అల్లు అర్జున్ నెంబర్ 2..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామితో యాంకర్ ఇలా మాట్లాడుతూ.. కల్కి 2898 ఏడి హిట్ అంటే ఒప్పుకోవడం లేదు.. మీరు బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతాయని చెప్పారు.. కానీ సలార్, కల్కి రెండు మంచి విజయం సాధించాయి కదా.. అని అడగగా.. దీనికి వేణు స్వామి మాట్లాడుతూ.. కల్కి బ్లాక్ బస్టర్ అనగానే సలార్ సూపర్ హిట్ అన్నారు.. కానీ రూ.150 కోట్లు నష్టం వచ్చింది కదా.. కల్కి కూడా అంతే.. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.. అప్పుడు ఎవరు అడగలేదు ఏంటి.. అప్పుడు నాకేమైనా కిరీటాలు పెట్టారా.. లేదు కదా.. సలార్, కల్కి హిట్ అయినా అది ప్రభాస్ స్టామినా వల్లే.. ఆయన క్రౌడ్ ఫుల్లింగ్ హీరో కాబట్టి ఆ సినిమాలు బాగా ఆడాయి..నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. నేను ప్రభాస్ ని వ్యక్తిగత విమర్శలు చేస్తే భయపడాలి.. నాకు ప్రభాస్ తో పర్సనల్గా మంచి అనుబంధంగా ఉంది. నా భార్య ప్రభాస్ కి ఆర్గానిక్ ఫ్రూట్స్ పంపిస్తూ ఉంటుంది.. అంటూ తెలిపారు.. అలాగే ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టగలిగే సత్తా ఉన్న హీరోలలో నంబర్ వన్ హీరో ప్రభాస్ ఐతే.. నంబర్ 2 హీరో అల్లు అర్జున్ అని కూడా తెలిపారు వేణు స్వామి. మొత్తానికి అయితే వేణు స్వామి రూట్ మార్చేశారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు