Venu Udugula: రీమేక్ ఆ డైరెక్ట్ ఆ ?

నీది నాది ఒకే కథతో దర్శకుడుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు వేణు ఊడుగుల. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది.
ఈ సినిమాను అప్పట్లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ రీమేక్ చేస్తాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ వేణు దగ్గుపాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో విరాటపర్వం సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ థియేటర్స్ లో కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. నిర్మాతలకు కొద్దిపాటి నష్టాలు మిగిల్చిన సంగతి విధితమే. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కి వచ్చినప్పుడు మంచి ప్రశంసలు దక్కాయి.

ఈ సినిమా తరువాత వేణు తదుపరి ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు ఒక సరైన క్లారిటీ రాలేదు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమాను చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన మొదటి సినిమా నీది నాది ఒక కథ చిత్రాన్ని రీమేక్ చేస్తాడా, లేదంటే ఒక కొత్త సబ్జెక్టు తో ముందుకు వెళ్తాడా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సార్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారి ఒక డైరెక్ట్ తెలుగు ఫిలిం చేస్తున్నాడు ధనుష్. అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లు ఇదివరకే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు వేణు – ధనుష్ కాంబినేషన్ ఎంతవరకు వాస్తవం ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు