Venuswamy : చైతూకి మళ్లీ ఆమె వల్లే డైవర్స్… ఈ సారి మూడేళ్లల్లోనే బ్రేకప్.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గతంలో నాగచైతన్య – సమంత విడిపోతారని చెప్పి వార్తల్లో నిలిచి, వైరల్ గా మారిన ఈయన ఇప్పుడు మళ్లీ నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. గతంలో సమంత – నాగచైతన్య విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది ఈయనను విమర్శించారు. దూషించారు కూడా. కానీ ఈయన చెప్పినట్టుగానే నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో వీరిద్దరూ విడిపోయారు. ఆ సమయంలో సమంత పై పలు రకాల రూమర్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

Venuswamy : Chaithu divers because of her again... this time breakup within three years.. Venu Swamy's sensational comments..!
Venuswamy : Chaithu divers because of her again… this time breakup within three years.. Venu Swamy’s sensational comments..!

మూడేళ్లకే నాగచైతన్య – శోభిత విడిపోతారు..

అయితే ఇప్పుడు తాజాగా నాగచైతన్య, శోభితతో నిన్న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోని పలు విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండగా.. తాజాగా వేణు స్వామి ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ శోభిత – నాగచైతన్య ఒక స్త్రీ కారణంగా మూడు సంవత్సరాలకే విడిపోయే అవకాశం ఉంది అంటూ హాట్ బాంబ్ పేల్చారు.

ఇద్దరి జాతకాల్లో  వచ్చాయి – వేణుస్వామి

వేణు స్వామి మాట్లాడుతూ.. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగోలేదు. అలాగే మూడేళ్ల తర్వాత చైతూ – శోభితకి ఒక స్త్రీ కారణంగా గొడవలు వస్తాయి. వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వీరికి ఏమాత్రం కలిసి రావడం లేదు. కచ్చితంగా విడిపోతారు అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి. నాగచైతన్య ఎంగేజ్మెంట్ శోభిత ధూళిపాళ్లతో జరిగినట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించారు వారు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం ఎలాంటిది అని గల్లీ జ్యోతిష్కుడు కూడా చెప్పగలడు. వీరి నిశ్చితార్థం ఉత్తరా నక్షత్రంలో జరిగింది. నాగచైతన్య రాశి కర్కాటక రాశి , శోభిత ధూళిపాలది ధనస్సు రాశి.. నాగచైతన్యకు 6, శోభితకు 8 నంబర్లు వచ్చాయి. ఇద్దరి జాతకాల్లో కూడా షష్టాకాలు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి.

- Advertisement -

2027 తర్వాత వీరిద్దరూ విడిపోతారు..

ఇక నిజానికి సమంత జాతకం, శోభిత జాతకం విశ్లేషించినట్లయితే.. ఇద్దరి జాతకాలలో కూడా శని దృష్టి కుజుడి పైన ఉంది. ముఖ్యంగా శోభిత జాతకంలో శని దృష్టి కుజుడు,శుక్రుడు, గురుడు మీద కూడా ఉంది. వీరి జాతకం ప్రకారం వీరిద్దరికి 2027 నుంచి సమస్యలు మొదలవుతాయి. అంతవరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత వైవాహిక జీవితంలో గొడవలు వచ్చి ముఖ్యంగా స్త్రీ మూలంగా వీరిద్దరూ విడిపోతారు అంటూ తెలిపారు వేణు స్వామి. అంతేకాదు వీరి జాతకాలు కలవకపోవడమే కాకుండా వీరికి పెట్టిన నిశ్చితార్థ ముహూర్తం కూడా సరిగ్గా లేదని , నాగచైతన్యతో సమంతకి నేను 100 కి 50 మార్కులు వేస్తే , శోభిత 10 మార్కులు మాత్రమే వేస్తాను.

స్త్రీ కారణంగా ఖచ్చితంగా శోభిత – చైతూ విడిపోతారు..

నాగచైతన్య సమంతకి 50 మార్కులు వేసినా సమంత విషయంలో ఏం జరిగిందో మీరు చూశారు. అలాంటిది నేను శోభితాకీ 10 మార్కులే వేశాను అంటే ఇక ఏం జరుగుతుందో మీరే ఆలోచించుకోండి. కెరియర్ పరంగా సమంత జాతకం 100% బాగుంది. కానీ శోభితకు 20% మాత్రమే బాగుంది అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి. నేను చెప్పేది నిజం అందరూ బాగుండాలని చెబుతున్నాను. కచ్చితంగా ఒక స్త్రీ కారణంగా నాగచైతన్య , శోభిత విడిపోతారు అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు