Venuswamy: చంపేస్తామంటూ ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ బెదిరింపులు.. ఏమైందంటే..?

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎప్పుడో ఒక సినిమాలో మాత్రమే కనిపించి.. ఆ తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే చెప్పాలి. అయితే సినిమాలలో నటించకపోయినా.. సినిమా నటీనటుల జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత , వృత్తి పరమైన విషయాలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. అయితే ఈయన చేసే కామెంట్లు ఒకసారి నిజమవుతాయి.. మరొకసారి బోల్తా కొడుతూ ఉంటాయి.. అలా బోల్తా కొట్టినప్పుడే ఆ అభిమాన హీరో లేదా హీరోయిన్ అభిమానులు వేణు స్వామి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

చంపేస్తామంటూ ప్రభాస్ ఫ్యాన్స్ బెదిరింపులు..

Venuswamy: Those star hero fans threatened to kill.. what happened..?
Venuswamy: Those star hero fans threatened to kill.. what happened..?

ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ప్రభాస్ జాతకం బాగాలేదని.. ఆయన చేసే ఏ సినిమా కూడా సక్సెస్ కాదు అని.. ఆస్ట్రాలజర్ వేణు స్వామి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గతంలో వేణు స్వామి మాట్లాడుతూ.. ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఘోరంగా డిజాస్టర్ అవుతుంది అని.. ఇక ఆయన కెరియర్ లో సక్సెస్ లే లేవు అని కామెంట్ చేశారు వేణుస్వామి.. అయితే ఊహించని విధంగా సలార్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. అయితే వేణు స్వామి అక్కడితో ఆగకుండా నాగ్ అశ్విన్ , ప్రభాస్ కాంబినేషన్లో కల్కి 2898 AD సినిమా తీస్తున్నారు కదా.. పైగా దీనికి రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇదంతా వృధా అవుతుంది.. సినిమా డిజాస్టర్ అవుతుంది అంటూ లేనిపోని కామెంట్లు చేశారు.. దీంతో ప్రభాస్ అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు.. కానీ నిన్న అనగా జూన్ 27వ తేదీన సినిమా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు మొదటి రోజు కలెక్షన్లతో రికార్డులను కూడా చెరిపివేసింది. రిలీజ్ కి ముందే సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు సినిమా భారీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండడంతో వేణు స్వామిని ప్రభాస్ అభిమానులు పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.. అంతేకాదు ఇంకోసారి ప్రభాస్ జాతకం అలా ఉంది..? ఇలా ఉంది..? సినిమాలు చేయకపోవడం మంచిది అని నోటికి వచ్చినట్లు వాగావో.. చంపేస్తాం నిన్ను.. అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా వేణు స్వామికి ప్రభాస్ అభిమానులు ఇస్తున్న వార్నింగ్ పూర్తిస్థాయిలో సంచలనంగా మారింది అని చెప్పవచ్చు.

వేణు స్వామి జాతకమే బాగోలేదా..

ఇక వేణు స్వామి విషయానికి వస్తే.. ఇటీవలే రాజకీయాలలో కూడా ఈయన తలదూర్చారు. టిడిపి, జనసేన , బిజెపి కూటమిగా ఏర్పడ్డాయి.. వైసిపి సింగిల్ గా 175 స్థానాల్లోనూ పోటీ చేసింది. అయితే ఈ విషయంపై ఈయన మాట్లాడుతూ.. కూటమి ఘోరంగా ఓటమి పాలవుతుందని.. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని కామెంట్లు చేశారు. అయితే ఊహించని విధంగా కూటమి 164 స్థానాలను కైవసం చేసుకోగా.. వైసిపి కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ నాయకులు, సినీ విశ్లేషకులు, జబర్దస్త్ కమెడియన్స్ కూడా వేణు స్వామిని పూర్తిస్థాయిలో టార్గెట్ చేసి ట్రోల్స్ చేశారు.. ఈ దెబ్బకు తాను ఇకపై జాతకాలు చెప్పనని స్టేట్మెంట్ ఇచ్చారు వేణు స్వామి… ఇక ఇప్పుడు గతంలో కల్కి సినిమా గురించి మాట్లాడిన మాటలు కూడా బెడిసి కొట్టడంతో పూర్తిస్థాయిలో బెదిరిస్తున్నారు ప్రభాస్ అభిమానులు.. మరి దీనిపై వేణు స్వామి ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.చివరిగా వేణు స్వామి జాతకమే బాగోలేదని కొంతమంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు