Venuswamy : చైతూ-శోభిత జాతకం పై ట్రోల్స్… జరిగింది చాలు… ఇక నుంచి ఏమీ ఆశించకండి.

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గత రెండు మూడు సంవత్సరాలుగా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ.. వారి వ్యక్తిగత విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కసారి ఈయన చెప్పిన జాతకాలు నిజమైతే మరొకసారి అందుకు రివర్స్ గా జరిగి ఈయనను ట్రోల్స్ కు గురిచేసాయి. ఇదిలా ఉండగా గతంలో వేణు స్వామి సమంత, నాగచైతన్య విడిపోతారంటూ హాట్ బాంబు పేల్చారు. ఈయన చెప్పినట్టుగానే 2021 అక్టోబర్ 2న వీరిద్దరూ విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ విషయం తెలిసి వేణు స్వామి జ్యోతిష్యంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Venuswamy : Trolls on Chaitu-Shobhita Horoscope... Enough happened... Don't expect anything from now on.
Venuswamy : Trolls on Chaitu-Shobhita Horoscope… Enough happened… Don’t expect anything from now on.

రాజకీయ విశ్లేషణలో ఫెయిల్ అయిన వేణు స్వామి..

అంతేకాదు ఈయన చేత చాలామంది హీరోయిన్లు యాగం చేయించుకుని ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా రష్మికాను మొదలుకొని నిధి అగర్వాల్ వరకు చాలామంది ఈయనతో పూజ జరిపించుకున్న తరువాతనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయంలో ఈయన చెప్పిన ఏ విషయం కూడా నిజం కాలేదని చెప్పాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఓడిపోతారని, కేసీఆర్ మళ్ళీ మూడోసారి విజయం సాధిస్తారని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి అఖండ విజయం సాధించారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని, కూటమి కొట్టుకుపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ కూడా కూటమి అఖండ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు . దీంతో ఆ సమయంలో చాలామంది ఈయనపై విపరీతమైన ట్రోల్స్ చేశారు.

జ్యోతిష్యం చెప్పనని చైతూ – శోభిత జాతకం పై స్పందన..

దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈయనపై చాలా దారుణంగా ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇకపై జ్యోతిష్యం చెప్పనని , సెలబ్రిటీల జాతకాలలో తల దూర్చాను అంటూ తెలిపారు వేణు స్వామి. అయితే చాలా రోజుల తర్వాత నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు . అందులో భాగంగానే ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని వేణు స్వామి మళ్లీ ఇద్దరిపై జాతకం చెప్పారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకే విడిపోతారని, విడిపోయిన తర్వాత వీరి వ్యక్తిగత జీవితాలు మరింత దారుణంగా మారుతాయని తెలిపారు. అంతేకాదు ఒకవేళ వీరు కలిసినా, తల్లిదండ్రులు కాలేరని కూడా స్పష్టం చేశారు. వేణు స్వామి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే యోగ్యం లేదని, అందుకే ఆయన తండ్రి అనే పదానికి దూరం అంటూ కామెంట్ చేశారు వేణు స్వామి.దీంతో ఇక చాలా రోజుల తర్వాత జ్యోతిష్యం చెప్పనని చెప్పి , మళ్లీ వీరి జ్యోతిష్యం పై స్పందించడంతో నెటిజెన్లు పూర్తిస్థాయిలో స్పందిస్తున్నారు. జ్యోతిష్యం చెప్పను అని చెప్పి మళ్ళీ చెబుతున్నాడు ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక వీడియో విడుదల చేశారు వేణు స్వామి.

- Advertisement -

జ్యోతిష్యం చెప్పను అంటూ వీడియో షేర్ చేసిన వేణు స్వామి..

ఆ వీడియోలో వేణు స్వామి మాట్లాడుతూ.. నేను జాతకం చెప్పనని గత రెండు నెలల క్రితం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే గతంలో సమంత – నాగచైతన్యకు జ్యోతిష్యం చెప్పగా, అది జరిగింది.. దానికి ఎక్స్టెంటెడ్ గా ఇది చెప్పాను తప్ప మరే ఉద్దేశం లేదు. ఇకపై సెలబ్రిటీల జాతకాల గురించి నేను ఎక్కడా ప్రస్తావించను. నేను మాట తప్పలేదు, ఇటీవల మా అధ్యక్షుడు మంచు విష్ణు తో కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను. ఆయన కూడా సూపర్ స్వామి గారు అంటూ నాకు చెప్పారు. ఇక నేను జ్యోతిష్యాలు చెప్పను, ప్రత్యేకించి సెలబ్రిటీలు జాతకాలు,రాజకీయ విశ్లేషణలు ఏవి చేయను అంటూ క్లారిటీ ఇచ్చారు వేణు స్వామి. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు