Kollywood : కోలీవుడ్ లో మూడు వారాల గ్యాప్ లో నాలుగు క్రేజీ సినిమాలు..

Kollywood : సౌత్ లో ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో పొంగల్ తర్వాత పెద్దగా సినిమాల సందడి లేదు. అన్ని ఇండస్ట్రీలలో పెద్ద హీరోల సినిమాలు వాయిదా పడుతూ రాగా, వచ్చిన మీడియం రేంజ్, చిన్న సినిమాలు ఎక్కువగా ఆడలేదు. ఒక్క మలయాళంలో మాత్రమే వరుస హిట్లు నమోదయ్యాయి. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం అన్ని ఇండస్ట్రీలలో కూడా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా పండగలకి స్టార్ హీరోల సినిమాలు వరుస బెట్టి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక తెలుగులో దేవర తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలు కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ కోలీవుడ్ లో మాత్రం దసరా దీపావళికి నాలుగు సినిమాలు రిలీజ్ డేట్ కంఫర్మ్ చేసుకున్నాయి. అవి కూడా స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.

 Vettayin, Kanguva, Vidaamuyarchi, Amaran movies releasing in October in Kollywood

తలైవా తోనే మొదలు..

ఇక కోలీవుడ్ (Kollywood) లో రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో నాలుగు సినిమాలు కేవలం మూడు వారాల గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. దసరా, దీపావళికి నాలుగు క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ముందుగా తలైవా రజినీకాంత్ నటిస్తున్న ‘వేట్టాయిన్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాను జై భీం డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ కూడా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అయిపోయిన ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

- Advertisement -

దీపావళికి మరో క్రేజీ సినిమాలు…

ఇక దసరా కి రెండు పాన్ ఇండియా సినిమాలు వస్తుండగా, దీపావళి కి మరో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి విదా ముయార్చి. థలా అజిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విదా ముయార్చి’ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. అలాగే కోలీవుడ్ యంగ్ స్టార్ శివ కార్తికేయన్ నటిస్తున్న ‘అమరన్’ సినిమాని కూడా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మిస్తుండగా, రాజ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇలా మూడు వారాల గ్యాప్ తో నాలుగు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతుండడం చాలా రోజుల తర్వాత జరుగుతుండగా, అన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు