Vijay Antony: జీవితాంతం అలాగే ఉంటా – హీరో షాకింగ్ నిర్ణయం..!

Vijay Antony.. హీరోగా , డైరెక్టర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇలా అన్ని రంగాలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యి.. ఆ తర్వాత తన ప్రతి సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఇటీవల బిచ్చగాడు 2, లవ్ గురు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈయన త్వరలో తుఫాన్ అనే సినిమాతో రాబోతున్నారు… తాజాగా ఈ సినిమా టీజర్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో చెప్పులు లేకుండా వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు విజయ్ ఆంటోనీ..

జీవితాంతం చెప్పులు లేకుండా ఉంటా..

Vijay Antony: Remains the same for the rest of his life - shocking decision of the hero..!
Vijay Antony: Remains the same for the rest of his life – shocking decision of the hero..!

ఇకపోతే ఈ విషయం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు దీనిపై ప్రశ్నించారు కూడా.. ఇక ఈ విషయంపై విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. చెప్పులు లేకుండా బాగానే ఉంది.. మొదట్లో కొంచెం నొప్పి ఉంటుంది.. ఇబ్బందిగా అనిపిస్తుంది.. కానీ ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది.. ఆరోగ్యానికి కూడా ఇది మంచిదే ..జీవితాంతం ఇలాగే చెప్పులు లేకుండా ఉండాలని ఫిక్స్ అయ్యాను.. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.. అంటూ తెలిపారు విజయ్ ఆంటోనీ..మొత్తానికి విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఆరోగ్యపరంగా ఈయన తీసుకున్న నిర్ణయం మంచిది అని పలువురు ఆరోగ్య నిపుణులు కూడా కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా జీవితాంతం చెప్పులు లేకుండా ఉంటానని చెప్పి పెద్ద సాహసమే చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కూతురు వల్లే ఈ మార్పు..

ఇకపోతే విజయ్ ఆంటోనీ ఇటీవలే తన కూతుర్ని కోల్పోయిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి కొంచెం వేదాంతంగా మాట్లాడడం, జీవితం గురించి మాట్లాడటం లాంటివి చేస్తున్నారు .ఈ క్రమంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని అభిమానులు భావిస్తున్నారు.. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి..

- Advertisement -

విజయ్ ఆంటోనీ కెరియర్..

భారతీయ సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు , సినిమా ఎడిటర్, గేయ రచయిత , ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాత అయిన ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నారు. 2005లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలోకి అరంగేట్రం చేసి ఉత్తమ సంగీత విభాగంలో నాక ముక్క అనే పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్ ని కూడా గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడుగా రికార్డు సృష్టించారు. 2011లో క్రికెట్ ప్రపంచ కప్ లో ఈ పాట పాడబడింది. తర్వాత డైరెక్టర్ గా హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.

విజయ్ ఆంటోని వ్యక్తిగత జీవితం..

2006లో ప్రముఖ సినిమా నిర్మాత ఫాతిమాను వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కూతురు మీరా 2013 సెప్టెంబర్ 19న 16 ఏళ్ల వయసులో చదువు ఒత్తిడి కారణంగా చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఇక కూతురు మరణించిన తర్వాత పూర్తిగా వేదాంతం వైపు మాట్లాడుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు విజయ్ అంటోని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు