Toofan : ఇంట్రెస్టింగ్ గా విజయ్ ఆంటోనీ తుఫాన్ ట్రైలర్.. కం బ్యాక్ ఇచ్చినట్టే?

Toofan : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా బాగా పాపులర్ అయిన ఈ హీరో, అప్పటినుండి తాను ఏ సినిమా చేసినా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. అయితే బిచ్చగాడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ పడలేదు. ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బిచ్చగాడు2 ఓ మోస్తరు సక్సెస్ సాధించగా, ఈ ఇయర్ ఆల్రెడీ లవ్ టుడే అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించగా, ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు. అయితే ప్రేక్షకులని మెప్పించడానికి ఎలాంటి పాత్రలైనా, చేసే హీరోల్లో విజయ్ ఆంటోనీ ఒకరు. విజయ్ నటించిన Dr. సలీం, భేతాళుడు అలాగే బిచ్చగాడు లాంటి చిత్రాలే దానికి ఉదాహరణ. అయితే కంటెంట్ బాగున్నా, దాన్ని ప్రేక్షకులకి కనెక్ట్ చేయడం లో విజయ్ సినిమాలు విఫలమవుతున్నాయి. ఇకపోతే ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు.

Vijay Antony Toofan Movie Trailer Talk

తుఫాన్ గా విజయ్ అంటోని…

ఇక విజయ్ ఆంటోని రీసెంట్ గా లవ్ టుడే మూవీతో ప్లాప్ అందుకోగా, లేటెస్ట్ గా తుఫాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక అప్పట్లో ఫస్ట్ లుక్ తోనే బాగా ఇంప్రెస్స్ చేసిన తూఫాన్ నుండి మేకర్స్ తాజాగా “తుఫాన్” మూవీ యొక్క ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ఇక పూర్తిగా యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ క‌థ‌తో తెర‌కెక్కిన తుఫాన్ ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్ గా క‌నిపిస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ దాదాపు ట్రైలర్ లో తెలిసిపోతున్నా, హీరో తాలూకు డీటెయిల్స్ మాత్రం ట్రైలర్ లో రివీల్ చేయలేదు. అయితే ఈ ట్రైలర్ లో గతం గుర్తులేని వ్య‌క్తిగా విజ‌య్ ఆంటోని ఇందులో క‌నిపించారు. దాని చుట్టూ అల్లిన కథ, అసలు విజయ్ ఆంటోనీ ఎవరూ? అనేది సస్పెన్స్ గా ఉంచారు. ట్రైలర్ స్టార్టింగ్ లో విజయ్ కాకుండా మిగతా పాత్రలపైనే ఫోకస్ ఉండగా, ఎండింగ్ వచ్చేసరికి విజయ్ పాత్ర పై ఫోకస్ చేసారు. అంటే విజయ్ ఆంటోనీ సినిమాలో లేట్ ఎంట్రీ ఏమైనా ఇవ్వొచ్చని అనిపిస్తుంది. ఇక విజ‌య్ ఆంటోని తుఫాన్ లో చాలా కొత్త లుక్ లో అట్రాక్టివ్ గా క‌నిపిస్తున్నాడు.

- Advertisement -

కం బ్యాక్ ఇచ్చేలా ట్రైలర్…

ఇక విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ (Toofan) మూవీని విజ‌య్ మిల్ట‌న్ డైరెక్ట్ చేయగా, ఈ మూవీలో స‌త్య‌రాజ్, మేఘ ఆకాష్, డాలి ధ‌నంజ‌య, ముర‌ళీ శ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ట్రైలర్ చివర్లో ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. అయితే జులై లో సినిమా వస్తుందన్నా, అది ఇండియన్2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని అనిపిస్తుంది. ఆ సినిమాకి ఓ రేంజ్ లో టాక్ వస్తే, తుఫాన్ ని వాయిదా వేయొచ్చు. ఇక గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని విజయ్ ఆంటోనీ తుఫాన్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు