Vishwambhara: మెగా ఛాన్స్ పట్టేసిన నాగ్ డైరెక్టర్… చిరు కోసం మళ్ళీ అదే పని

గతంలో ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తర్వాత దర్శకులుగా మారిన దాఖలాలు మనం చూసాం. ప్రభుదేవా లాంటి వారైతే ప్రస్తుతానికి బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్ వంటి వారిని కూడా డైరెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో తాజాగా ఒక కొరియోగ్రాఫర్ కూడా దర్శకుడిగా అవతారం ఎత్తాడు. ఆయన ఇంకెవరో కాదు విజయ్ బిన్నీ. ఇప్పటికే “నా సామి రంగ” మూవీతో డైరెక్టర్ గా మారిన బిన్నీ తాజాగా చిరు కోసం మరోసారి కొరియోగ్రాఫర్ గా మారాడు. చివరికి చిరుతో కల నెరవేరింది అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా…
విజయ్ బిన్నీ గతంలో కొరియోగ్రాఫర్ గా ఎన్నో తెలుగు సినిమాలకు పని చేశాడు. అలాగే తమిళ కన్నడ ప్రాజెక్టులకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేస్తూ ఉండేవాడు. నాగార్జున కోసం ఆయన డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. నాగ్ హీరోగా “నా సామి రంగ” అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా రిలీజైన హిట్ మూవీస్ లో ఇది రెండవది. విజయ్ బిన్నీ దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేయడానికి పలు స్క్రిప్టులు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా “నా సామి రంగ” ప్రమోషన్స్ టైంలో చెప్పుకొచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి సినిమాకే ఆయన ముగ్గురు హీరోలను, ముగ్గురు హీరోయిన్లను డైరెక్ట్ చేశాడు. “నా సామి రంగ” సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ అదేవిధంగా రాజ్ తరుణ్ లను కూడా ఆయన డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ మూవీతోనే డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ బిన్నీ దర్శకుడిగా మాత్రమే సినిమాలు చేస్తాడని అందరూ భావిస్తూ వస్తున్న తరుణంలో ఆయన ఒక షాకింగ్ ట్వీట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిజానికి అది విజయ్ బిన్నీ అభిమానులు సంతోషించాల్సిన విషయమే.

చిరు కోసం మళ్ళీ అదే పని…
విజయ్ బిన్నీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “విశ్వంభర” సినిమాలో ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. నిజానికి కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన తర్వాత చాలామంది కొరియోగ్రఫీకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ విజయ్ బిన్నీ మాత్రం మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టు అని తెలియగానే ఎగిరి గంతేసి, ఆయనని కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు తెలుస్తోంది. “విశ్వంభర” మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక అద్భుతమైన సాంగ్ కు కొరియోగ్రఫీ చేశాను అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విజయ్ బిన్నీ పంచుకున్నారు.

- Advertisement -

అలాగే తన సంతోషాన్ని మాటల్లో కాకుండా పోస్టర్ ద్వారా వ్యక్తం చేశారు. డ్రీమ్ కం ట్రూ అంటూ జెర్సీ మూమెంట్ తో ఉన్న ఇన్స్టా పోస్ట్ ను షేర్ చేశారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు బిన్నీ కొరియోగ్రఫీ చేస్తే బాస్ నుంచి గ్రేస్ ఫుల్ డాన్స్ కచ్చితంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పైగా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కంటే విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ బెటర్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మెగాస్టార్ లాంటి మంచి గ్రేస్ ఫుల్ డాన్సర్ ను కొరియోగ్రఫీ చేయాలని ఏ కొరియోగ్రాఫర్ కు ఉండదు చెప్పండి? మొత్తానికి విజయ్ బిన్నీ చిరుతో డాన్స్ చేయించాలి అన్న తన కలను నెరవేర్చుకున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు