VD12 : విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నుండి సాలిడ్ అప్డేట్…

VD12 : టాలీవుడ్ రౌడీ హీరో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ ఇయర్ ఫ్యామిలీ స్టార్ తో డిజాస్టర్ అందుకున్నా, లేట్ చేయకుండా వేరే ప్రాజెక్టుల షెడ్యూల్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల్లో అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్న VD12. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఇదిలా ఉండగా తాజాగా VD12 కి సంబంధించి చిత్ర యూనిట్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

Vijay Devarakonda - Gautham Tinnanuri VD12 Movie Release Update

సాలిడ్ లుక్ తో క్రేజీ అప్డేట్స్…

ఇక విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పై ముందునుండి భారీ అంచనాలు నెలకొని ఉండగా, రీసెంట్ గా లీక్ అయిన స్టిల్స్ కూడా క్రేజీ గా ఉండి, సినిమాపై అంచనాలు పెంచేసాయి. తాజాగా ఒక అఫిషియల్ అప్డేట్ తో మేకర్స్ విజయ్ దేవరకొండ యొక్క సాలిడ్ లుక్ పోస్టర్ ని వదిలి ప్రకటించారు. మరి ఫైనల్ గా ఇప్పుడు ఆ లుక్ తో విజయ్ పై సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీస్ చేశారు. ఆ పోస్టర్ లో విజయ్ మాస్ అండ్ రగ్గడ్ గా కనిపిస్తూ వర్షంలో అరుస్తునట్టు ఉంది. అయితే ఈ లుక్ వన్ సైడ్ నుండే ఉండగా, బహుశా ఒక ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించి స్టిల్ అయి ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ పోస్టర్ తోనే మేకర్స్ రిలీజ్ డేట్ పై కూడా అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.

- Advertisement -

సమ్మర్ ధమాకాగా VD12…

ఇక చిత్ర యూనిట్ నుండి వచ్చిన అప్డేట్ లో VD12 సినిమాను వచ్చే ఏడాది అనగా 2025 మార్చ్ 28న సమ్మర్ లో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతే కాదు, ఈ సినిమాకి సంబంధించి మూడో ట్రీట్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ ఆగస్ట్ నెల లోనే VD12 ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారట. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తునట్టు సమాచారం. ఇక టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చాక టీజర్ అప్డేట్ కూడా చెప్పే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు