Vijay Devarakonda: గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న మూవీ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ అప్డేట్స్

Vijay Devarakonda: మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడు ఇచ్చాడు గౌతమ్ తిన్ననూరి. దాదాపు సుమంత్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఆ సినిమాతో మంచి హిట్ ను సాధించి, సుమంత్ కి కూడా మళ్లీ అవకాశాలు వచ్చేలా చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఆ సినిమా తర్వాత గౌతమ్ చేసిన సినిమా జెర్సీ. జెర్సీ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది జెర్సీ సినిమా. రెండవ సినిమాని ఇంత బాగా తెరకెక్కించాడు అనే మంచి పేరును కూడా సంపాదించగలిగాడు గౌతమ్.

గౌతమ్ తిన్ననూరి ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాను యూవి క్రియేషన్స్ నిర్మిస్తుంది అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాని విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు గౌతమ్.

గౌతమ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. వీడి 12 అని వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ 30 రోజులు పాటు వైజాగ్ లో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ను శ్రీలంకలో షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ నటిస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

- Advertisement -

VD12 First Look

 

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే అనిరుధ్ రవిచంద్రన్ మరియు గౌతమ్ కలిసి జెర్సీ సినిమాకి పనిచేశారు. జెర్సీ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన మ్యూజిక్ ని అందించాడు. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ కారణంగా అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి కూడా అనిరుధ్ రవిచంద్రన్ తప్పుకోవలసి వచ్చింది. అయితే అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ కి సమాధానంగా జెర్సీకి మంచి మ్యూజిక్ ఇచ్చి తనని తాను నిలబెట్టుకున్నాడు అనిరుధ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు