Vijay Devarakonda: డ్యూయల్ రోల్ లో కనిపించనున్న విజయ్

Vijay Devarakonda: నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్. పెళ్లిచూపులు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించి మంచి హిట్ అయింది. మొదటి సినిమాతోనే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిపోయాడు విజయ్.

పెళ్లిచూపులు సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి అనే సినిమా విజయ్ కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. కేవలం మలుపు తిప్పడమే కాకుండా స్టార్ హీరోని చేసేసింది. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను చూపించిందో దాదాపు అదే ఇంపాక్ట్ ను చూపించింది అర్జున్ రెడ్డి సినిమా. ఈ సినిమా తర్వాత విజయ్ కి వరుస అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత చేసిన గీతగోవిందం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే కెరీర్ స్టార్టింగ్ లోని ఇలా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. అలానే టాక్సీవాలా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే రాహుల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది.

- Advertisement -

ఇప్పుడు విజయ నటించబోయే 14వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు రాహుల్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రీసెంట్ గా విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతుంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ రాయలసీమ మాండలీకం మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సరసన రష్మిక మందన నటించబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు