Vijay Deverakonda : నేనే అర్జున – ఏం చేసుకుంటారో చేసుకోండి… ట్రోల్సర్స్‌కి రౌడీ మాస్ రిప్లే…

Vijay Deverakonda :సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా చిన్న చిన్న పాత్రలో కనిపించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిపోయాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ ఆటిట్యూడ్ లో చాలా మార్పు వచ్చిందని. చాలామంది అప్పటినుంచి ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

ఇకపోతే విజయ్ విషయానికి వస్తే విజయ్ కి ట్రోలింగ్ అనేది కొత్త విషయం కాదు. విజయ్ సినిమా కొంచెం తేడా కొట్టిన కూడా దానిని కొంతమంది ఏకి పారేస్తారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో విజయ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది అని చెప్పొచ్చు. ఎన్నో అంచనాల మీద వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించుకోలేకపోయింది. అయితే లైగర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి విజయ్ మీద ట్రోల్స్ ఇంకా ఎక్కువగా మొదలయ్యాయి. దీనికి కారణం ఆ సినిమా రిలీజ్ విజయ్ ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్. ఆ సినిమా రిలీజ్ టైం లో ఈ సినిమా దాదాపు 200 కోట్లు నుంచి నేను కలెక్షన్ లెక్క పెట్టడం మొదలు పెడతాను అంటే చెప్పుకొచ్చాడు. అయితే సినిమా కనీసం బ్రేక్ ఇవ్వని కూడా కాలేదు అప్పటినుంచి విజయ్ మీద ట్రోల్స్ ఇంకా మొదలయ్యాయి.

Kalki 2898 AD

- Advertisement -

ఇక రీసెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ నటించింది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి అర్జునుడి పాత్రను ఇచ్చాడు. అర్జునుడు పాత్రలో కనిపించిన విజయ్ చాలా తక్కువసేపైనా కూడా చాలామంది ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. అయితే విజయ్ మీద కొంతమంది ఇంకా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఆ పాత్రకు అసలు విజయ్ ఎందుకు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సమానంగా అర్జునుడి పాత్రలో ఉన్న విజయ్ ఫోటోని అన్ని సోషల్ మీడియా ఎకౌంట్స్ కి డిపి గా మార్చేశాడు విజయ్. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు