Vijay: 4 భారీ సినిమాలు మిస్‌ చేసుకున్న విజయ్ దేవరకొండ ?

Vijay Dewarakonda: విజయ్ దేవరకొండ ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కోనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిలకైతే విజయ్ అంటే మహా పిచ్చి. ఇక విజయ్ పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో విజయ్ కి వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ సినిమా అనంతరం అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాడు.

Vijay Devarakonda
Vijay Devarakonda

అంతేకాకుండా మహానటి సినిమాలోను ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు ఎన్ని హిట్లు వచ్చాయో అదే స్థాయిలో ఫ్లాప్ లు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు విజయ్ నటించిన ద్వారక అనే సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా విజయ్ చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా ఫ్లాప్ అయినట్టే. వాస్తవానికి విజయ్ తన కెరీర్ లో నాలుగు బ్లాక్ బస్టర్ విజయ్ సినిమాలను తిరస్కరించారట. ఆ సినిమాలు కనుక విజయ్ చేసి ఉంటే స్టార్ హీరోల సరసన ఉండేవాడు.

ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…. ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోగా చేయమని అడిగితే విజయ్ తిరస్కరించాడట. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఉప్పెన సినిమాలో బుచ్చిబాబు విజయ్ ని హీరోగా చేయమని అడిగాడట. ముందు ఒప్పుకున్న ఆ తర్వాత చేయనని చెప్పాడట. విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కూడా అతడినే హీరోగా చేయమని సందీప్ రెడ్డి అడిగారట. అది తెలుగులో నేనే చేశాను కానీ హిందీలో నేను చేయను అని చెప్పారట. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా విజయ్ ని హీరోగా చేయమని పూరీ జగన్నాథ్ అతని చుట్టూ చిరిగి తిరిగాడట. విజయ్ స్టోరీ అంత విన్న తర్వాత నేను చేయనని ఖరాఖండీగా చెప్పేసాడట. ఈ నాలుగు సినిమాలు కనుక విజయ్ చేసి ఉంటే మంచి స్థాయిలో ఉండేవాడు. ఇక విజయ్ తదుపరి చేసే సినిమాలైనా మంచి హిట్ కావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు