Vijay new party: పుసుక్కున రజనీకాంత్ అంత మాట అన్నారేంటి..?

Vijay new party.. ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కొత్త పార్టీలను ఏర్పాటు చేస్తూ.. ప్రజలలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రజారాజ్యం (Prajarajyam)పార్టీని పెట్టి సక్సెస్ కాలేక, ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తే.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ(Janasena party) ని స్థాపించి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే మరొకవైపు కోలీవుడ్(Kollywood )లో కూడా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. అలాంటి వారిలో విజయ్ దళపతి (Vijay dalapati)కూడా ఒకరు. అయితే ఈయన ఇప్పటికే ఉన్న పార్టీలలో చేరకుండా సొంతంగా ఒక కొత్త పార్టీని ప్రకటించారు.

Vijay new party: What did Rajinikanth say about new party..?
Vijay new party: What did Rajinikanth say about new party..?

కొత్త పార్టీ ప్రకటించిన విజయ్ దళపతి..

సమాజ సేవ చేయడానికి ఎటువంటి నిబంధనలు ఉండకూడదనే ఆలోచనతో ఇలా కొత్త పార్టీని ప్రకటించారు విజయ్ దళపతి. ఈ పార్టీపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి.. 2026 తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు కూడా.. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత అధికార పార్టీ డిఎంకే పని అయిపోయిందని, ఆ పార్టీ మూసేసుకోవాలంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రజినీకాంత్ సంచలన కామెంట్లు చేశారు. దీంతో రాజకీయ వర్గాలలో ఈ కామెంట్ లు తీవ్ర చర్చకు దారితీసాయి.

విజయ్ పార్టీ పై రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం రోజు మంత్రి ఏ.వి. వేలు రచించిన కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్ అనే ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజనీకాంత్ మాట్లాడుతూ.. డీఎంకే పార్టీ ఒక మర్రిచెట్టు వంటిది .ఎలాంటి తుఫాను నైనా సరే ఈ పార్టీ తట్టుకొని ఎదుర్కోగలదు. డీఎంకే అనే మర్రిచెట్టును ఎవరు కూడా కదిలించలేరు. ఇక రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులూ చేసే విమర్శలు ఇతరులను బాదించకూడదు కదా .. మాజీ ముఖ్యమంత్రి కళాకారుడు కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కచ్చితంగా వారు కనుమరుగయ్యేవారు. కరుణానిధి పాలనలో సమాజం, ప్రజల సంక్షేమం ఎంతో అభివృద్ధి చెందింది. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట ఆయన ఒక్కడే మాట్లాడారంటే.. పైనుంచి ఆర్డర్లు రావడం వల్ల ఆయన అంతలా మాట్లాడి ఉంటారు. సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అయితే స్టాలిన్ సమర్థవంతంగా ఆ పని చేస్తూ పార్టీని విజయపథం వైపు తీసుకు వెళుతున్నారు. ఆయనకు నా అభినందనలు అంటూ తెలిపారు రజనీకాంత్..

- Advertisement -

ఫైర్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్..

అయితే రజనీకాంత్ ఇలా కామెంట్లు చేయడంతో.. పుసుక్కున రజనీకాంత్ అంత మాట అన్నారేంటీ.. ఇది విజయ్ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన కామెంట్లు చేశారంటూ తమిళ తంబీలు చర్చిస్తున్నారు ఈ విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు