Vijay Sethupathi: సంచలన దర్శకుడుతో విలక్షణ నటుడు , ఏమి నమ్మి డేట్స్ ఇచ్చాడో.?

Vijay Sethupathi: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సంచలనాత్మకమైన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. శివ సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన మార్ ఏంటో క్రియేట్ చేసి సంచలనం సృష్టించాడు. శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నవాళ్లు వాళ్ళు అప్పటికే రాసిన స్క్రిప్షన్ కూడా చింపేశారు. అంటే తెలుగు సినిమా అనేది ఎంత ముందుకు వెళ్లిపోయిందో అనేదానికి నిదర్శనం ఆ పరిణామం. రాంగోపాల్ వర్మ థాట్స్ ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. చాలామంది దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మ కి ఉంది.

వర్మ దగ్గర పనిచేసిన చాలామంది స్టార్ డైరెక్టర్ లుగా నేడు మంచి పేరును సంపాదించారు. అయితే రామ్ గోపాల్ వర్మ ను జెన్యూన్ గా ఇష్టపడిన వాళ్లను రాంగోపాల్ వర్మ లాస్ట్ గా చేసిన బెస్ట్ వర్క్ ఏది అని అడిగితే రక్త చరిత్రను చెబుతారు. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా స్క్రాప్. కొన్ని జెన్యూన్ అటెండ్ అని చెప్పినవి కూడా థియేటర్ కి వెళ్లేసారికి నిరాశను మిగిల్చాయి. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వడానికే చాలా కష్టంగా ఉండేది. ఆ సినిమాకు సరైన ఆదరణ అసలు దక్కేది కాదు. దానికి పరిష్కారంగా అదే సినిమాలను ఇంటర్నెట్లో వదిలేసే వాళ్ళు రాంగోపాల్ వర్మ.

Vijay Sethupathi

- Advertisement -

ఇకపోతే రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో కొత్త సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు కేవలం తన స్వార్థం కోసం డబ్బు కోసం సినిమాలు చేసే రాంగోపాల్ వర్మ ఈసారి సిన్సియర్ గా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంచలన దర్శకుడు ఈ సినిమా కోసం విలక్షణ నటుడు అయినా విజయ్ సేతుపతి ను తీసుకోనున్నారు. ఇకపోతే రీసెంట్ గా మహారాజా అనే సినిమాతో మంచి హిట్ అందుకుని 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు విజయ్ సేతుపతి. ఇక రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చేయబోయి సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు