Maharaja : ఏంటి.. క్లైమాక్స్ కాపీనా…? ఈ మూవీ నుంచి మొత్తం దింపారుగా

Maharaja : ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మూవీస్ లో “మహారాజ” ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా గత వారం థియేటర్లలో విడుదలై యునానిమస్ రెస్పాన్స్ తో మౌత్ టాక్ తో దుమ్ములేపుతుంది. కళ్ళు చెదిరే కలెక్షన్లతో లాంగ్ రన్ లో దూసుకుపోతుంది. నిజానికి ఈ సినిమాపై రిలీజ్ ముందు వరకూ అంచనాలు లేవు. కానీ విజయ్ సేతుపతి మెస్మరైజింగ్ యాక్టింగ్ కి తోడు, స్క్రీన్ ప్లే బలం కూడా తోడవడంతో మౌత్ టాక్ తోనే ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక తమిళ్ లో ఈ ఏడాది లో ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ పడగా, చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు విజయ్ సేతుపతి తన “మహారాజ” (Maharaja) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పాలి. విజయ్ సేతుపతి కెరీర్ లో 50 వ సినిమాగా వచ్చిన ఈ సినిమాతో ఒక గుర్తుండిపోయే భారీ హిట్ ని కొట్టేసాడు. కొత్త దర్శకుడు నిథిలన్ సామినాథన్ తో చేసిన ఈ సినిమా గత వారమే థియేటర్స్ లోకి వచ్చింది. బుకింగ్స్ ఆన్లైన్ లో కాకుండా ఎక్కువగా మౌత్ టాక్ తో థియేటర్ల వద్దే ఎక్కువ అవడం విశేషం. ఇక ఈ సినిమాలో మెప్పించే థ్రిల్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ కూడా చాలామందిని ఎంతగానో కదిలించింది. ఇంకా చెప్పాలంటే మన తెలుగులో ఈ సినిమాకి ప్రమోషన్స్ లో “ముగింపు ఎవరికీ చెప్పొద్దు” అంటూ ప్రమోట్ చేశారు.

Vijay Sethupathi Starrer Maharaja Movie Climax 'Iratta' Copy?

మహారాజ క్లైమాక్స్ కాపీయా?

అయితే మహారాజ సినిమా క్లైమాక్ అయితే ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. కానీ.. ఈ సినిమా క్లైమాక్స్ తరహాలోనే ఆల్రెడీ మరో సినిమాలో కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా క్లైమాక్స్ కోసం సోషల్ మీడియాలో చాలా ఎక్కువే మాట్లాడుతున్నారు. ఆ సినిమా గురించి జనాలకి ఎక్కువగా తెలీదు. ఇక ఆ సినిమా కూడా ఎప్పుడో ఎక్కడో వచ్చింది కూడా కాదు… జస్ట్ గత ఏడాదిలోనే మన సౌత్ లోనే వచ్చింది.
ఇంతకీ ఈ సినిమా ఏ భాషలో వచ్చిందని అంటే తెలుగులో కాదు. సౌత్ లో అంటే కంటెంట్ కి మరో పేరుగా పిలుచుకునే మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆ సినిమా వచ్చింది. తమిళ్ లో విజయ్ సేతుపతి ఎలా వెర్సటైల్ నటుడో మలయాళంలో కూడా జోజు జార్జ్ అనే నటుడుకి వెర్సటైల్ నటుడుగా పేరుంది. ఇక అతను నటించిన మరి తాను ప్రధాన పాత్రలో అంజలి జోడిగా దర్శకుడు దర్శకుడు ఎం జి కృష్ణన్ తెరకెక్కించిన “ఇరట్టా” అనే సినిమాలో కూడా మహారాజ తరహా క్లైమాక్స్ కనిపిస్తుంది.

- Advertisement -

క్లైమాక్స్ సీన్ ని కనిపెట్టలేదా?

అయితే ఇరట్టా మూవీ క్లైమాక్స్ కి సంబంధించి ఇక్కడ చిన్న తేడా మాత్రం ఉంటుంది. అది వివరించేందుకు ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ, మొదట ఆ సినిమా చూసి తర్వాత మహారాజ చూసినవారికి మాత్రం ఖచ్చితంగా కాపీ చేసారా అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అయితే తండ్రి కూతురు మధ్య సన్నివేశం ఇంచుమించు ఒకేలా అనిపించక మానదు. ఇక ఇంతకీ ఈ ఇరట్టా అనే సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇంకా ఈ సినిమా మలయాళం, తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఇరట్ట అందుబాటులో ఉంది. ఇక మహారాజ చూసినవారు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఓసారి ఇరట్టా మూవీ కూడా ట్రై చేయవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ మహారాజ సినిమా ఓటిటి హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ వారే సొంతం చేసుకున్నారు. దీనితో ఒకేలాంటి క్లైమాక్స్ ఉన్న రెండు సినిమాలు ఒకే ఓటిటి వేదికని సొంతం చేసుకున్నాయి. ఇక మలయాళ నటుడు జోజు జార్జ్ తెలుగులో లాస్ట్ ఇయర్ ‘ఆదికేశవ’ మూవీలో విలన్ గా తాను కనిపించారు. కానీ సినిమా అనుకున్న డిజాస్టర్ కావడంతో జనాలకి పెద్దగా తెలీలేదు. ఇక మహారాజ సినిమా థియేటర్లలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి 50 కోట్ల మార్క్ దాటేసి, విజయవంతంగా దూసుకుపోతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు