Vijay Sethupathi: ఆ హీరోయిన్ తో నటించలేనంటూ చేతులెత్తేసిన విజయ్ సేతుపతి.. ఎవరంటే..?

Vijay Sethupathi: ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మక్కల్ సెల్వన్ అనే బిరుదుతో భారీ పాపులారిటీ సంపాదించుకొని.. కోలీవుడ్లో హీరోగా చలామణి అవుతూ టాలీవుడ్ లో విలన్ గా రెచ్చిపోతూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఈయన మహారాజా అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా జూన్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. ఎన్నో విషయాలను తెలియజేశారు విజయ్ సేతుపతి.. అందులో భాగంగానే హీరోయిన్ కృతి శెట్టి గురించి కూడా కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది..

మహారాజా గా విజయ్ సేతుపతి..

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న మహారాజా చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తూ ఉండగా.. ఈ చిత్రాన్ని నితిలన్ స్వామినాథన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ పిక్చర్స్ బ్యానర్లపై సుధన్ సుందరం, జగదీష్ పళని స్వామి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. భారతి రాజా, అనురాగ కశ్యప్ , అభిరామి , మమతా మోహన్ దాస్ కీలక పాత్రలు పోషించారు.. ఇక ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగానే విజయ్ సేతుపతి, కృతి శెట్టి గురించి మాట్లాడుతూ.. ఆమెకు జోడిగా నటించడం తన వల్ల కాదంటూ తెలిపారు..

కూతుర్లాంటి అమ్మాయితో రొమాన్స్ చేయలేను..

Vijay Sethupathi: Who is Vijay Sethupathi who raised his hands saying that he cannot act with that heroine?
Vijay Sethupathi: Who is Vijay Sethupathi who raised his hands saying that he cannot act with that heroine?

విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకుంటే చేయలేనని దర్శక నిర్మాతలకు చెప్పాను.. ఎందుకంటే నేను తెలుగులో ఉప్పెన సినిమా చేశాను.. అందులో ఆమెకు తండ్రిగా నటించాను. అందుకే డిఎస్పీ సినిమాలో ఆమెను నాకు జోడిగా పెడతామంటే చిత్ర బృందానికి కృతి శెట్టి అయితే వద్దు అని చెప్పాను.. ఉప్పెన సినిమా క్లైమాక్స్ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు కృతి శెట్టి చాలా కంగారు పడింది.. నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు..నన్ను నీ తండ్రిగా భావించు అని ఆమెకు ధైర్యం చెప్పాను.. అప్పుడు కూతురుగా భావించిన ఆమెతో నేను జోడి ఎలా కట్టగలను? అది నా వల్ల కాదు అంటూ తెలిపారు విజయ్ సేతుపతి.. మొత్తానికైతే కూతురుగా భావించిన అమ్మాయితో రొమాన్స్ చేయలేనని స్పష్టం చేశారు విజయసేతుపతి.

- Advertisement -

రెండు ప్రాజెక్టుల నుంచి కృతి శెట్టి అవుట్..

ఉప్పెన చిత్రం ద్వారానే కృతి శెట్టి కూడా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది.. ఆ సినిమాతోనే విజయ్ సేతుపతి కూడా నేరుగా తెలుగు చిత్రంలో నటించి విలన్ గా అవతారం ఎత్తారు.. ఇందులో బేబమ్మగా కృతి , రాయణం గా విజయ్ నటించగా.. ఇద్దరి మధ్య ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి. ఇక ఉప్పెన తర్వాత రెండు సినిమాలలో హీరోయిన్ గా చిత్ర యూనిట్ కృతి శెట్టిని ఎంపిక చేయగా విజయ్ సేతుపతి తిరస్కరించినట్లు సమాచారం.. డిఎస్పి సినిమాలో అనుక్రీతి వాస్ మరియు శివాని నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఇక అలా కృతి శెట్టితో నటించనని చెప్పి .. ఆ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించారు. అలా కోలీవుడ్ లో రెండు సినిమాలను విజయ్ సేతుపతి వల్ల కోల్పోయింది కృతి శెట్టి. ఇకపోతే సినిమాలలో క్యారెక్టర్ లను సినిమాలలో వరకే చూడకుండా నిజజీవితంలో లాగా ఆమె క్యారెక్టర్ ను భావించి ఆమెతో రొమాన్స్ చేయడానికి తిరస్కరించారు విజయ్ సేతుపతి. ఏది ఏమైనా ఈయన మంచి మనసుకి అందరూ ఫిదా అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు