Vijay sethupathi: నా సినిమాకి బ్యానర్ కట్టడం కూడా వేస్ట్ అన్నారు.. విజయ్ సేతుపతి ఎమోషనల్ కామెంట్స్..!

Vijay sethupathi: కోలీవుడ్ నటుడు అండ్ హీరో అయినటువంటి విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటించిన చిత్రం మహారాజా. ఈ సినిమా తో తన కెరీర్ లో హీరోగా బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు విజయ్ సేతుపతి. అయితే చాలామంది విజయ్ సేతుపతిని సపోర్టింగ్ పాత్రల‌లోనే చూసేందుకు ఇష్టపడతారు.

కానీ హీరోగా మాత్రం తన సినిమాలకి ఒకింత తక్కువ ఆదరణ దక్కుతుందని చెప్పుకోవచ్చు. కానీ దానిని మించి హీరోగా కూడా నిలదొక్కుకోగలడు అని మక్కుల్ సల్వన్ తన 50వ చిత్రంతో అందరికీ సమాధానం ఇచ్చాడు. అయితే తెలుగు సహా తమిళ్ లో భారీ విజయం సాధించడంతో ఈ మూవీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు మూవీ యూనిట్.

Vijay Sethupathi's emotional comments
Vijay Sethupathi’s emotional comments

ఇక ఈ ఈవెంట్ కి విజయ్ సేతుపతి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈయ‌న‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” రీసెంట్ టైంలో నా నుంచి వచ్చిన ఓ సినిమా రిలీజ్ కి .. ఒకరు.. అసలు నా సినిమాకి బ్యానర్ కట్టడం కూడా వేస్ట్ అని అన్నారు ” అంటూ విజయ్ సేతుపతి ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు తన మహారాజా మూవీకి ప్రేక్షకులు ఇచ్చిన భారీ విజయాన్ని ఉద్దేశించి కౌంటర్ వేశారు. ప్రజెంట్ ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు