The GreatestOfAllTime : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ సినిమా తెరకెక్కన సంగతి తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ (Thalapathy Vijay) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు మంచి అంచనాలు క్రియేట్ చేయగా, సాంగ్స్ మాత్రం బాగా ట్రోల్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కి రెండు వారాలే సమయం ఉండగా, మేకర్స్ సినిమా రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టారు.
రన్ టైం లాక్.. ఎంతంటే..
విజయ్ నటించిన గోట్ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుకు చేరుకున్నాయి. ఇక లేటెస్ట్ గా గోట్ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకోగా, గోట్ (The GreatestOfAllTime) చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. కాగా తాజాగా సినిమా రన్ టైం కూడా లాక్ అయింది. ఇక గోట్ సినిమా 2 గంటల 59 నిమిషాల నిడివితో ఉంటుందని తెలిసింది. మరీ ఇంత రన్ అంటే బాగా ఎక్కువే అని నెటిజన్లు అంటున్నారు. కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉంటే తప్ప గోట్ రన్ టైం ని భరించడం కష్టం.
భారీ తారాగణంతో గోట్..
ఇక విజయ్ గొట్ సినిమాలో భారీ తారాగణం నటించడం జరిగింది. ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, జయరాం, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వెంకట్ ప్రభు గోట్ సినిమాని డైరెక్ట్ చేయగా, సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుంది.