Overseas : తమిళులకే గిరాకీ

సాధారణంగా సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాలకి ఉండే క్రేజ్ నే వేరు. సంక్రాంతి పండుగకి సినిమా విడుదలైతే ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని హీరోలు నమ్ముతుంటారు. అటు తమిళంలో, ఇటు తెలుగులో రెండింటిలో కూడా హీరోలు పండుగ సీజన్ లలోనే తమ సినిమాలను ఎక్కువగా విడుదల చేస్తుంటారు. 2023 సంక్రాంతి పండుగకి తెలుగులో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదలవుతున్నాయి. అదేవిధంగా తమిళంలో అజిత్ నటించిన తునివు, విజయ్ దళపతి నటించిన వరిసు సినిమాలు విడుదల కాబోతున్నాయి. 

విజయ్ దళపతి నటించిన వరిసు సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను తెలుగులో భారీగానే రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ తునివు కూడా తెలుగులో విడుదల కావడంతో, తెలుగు హీరోల సినిమాలకు పోటీ ఎక్కువ అయింది. ఈ పోటీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోల సినిమాలకు సంబంధించి ఓవర్సీస్ బిజినెస్ ఇప్పటికే జరిగింది. తాజాగా తమిళ హీరోలకు సంబంధించిన బిజినెస్ అప్ డేట్ వచ్చింది.  ముఖ్యంగా తమిళ హీరో విజయ్ నటించిన వరిసు సినిమా ఓవర్సిస్ లో బిజినెస్ ఎక్కువగా చేసి రికార్డు సృష్టించింది.  వరిసు ఓవర్సిస్ లో రూ.35 కోట్ల బిజినెస్ చేస్తే.. అజిత్ నటించిన తునివు రూ.13 కోట్ల మాత్రమే చేసింది.  అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రూ.8.5 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ కాగా.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి రూ.5.5 కోట్ల బిజినెస్ చేసింది.   

తెలుగు హీరోల కంటే తమిళ హీరోల సినిమాలకే ఓవర్సిస్ మార్కెట్ లో గిరాకీ బాగున్నట్టు తెలుస్తోంది. తమిళ హీరో విజయ్ దళపతి సినిమా రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడమే ఇందుకు నిదర్శనం. అజిత్ సినిమా కూడా చిరంజీవి, బాలయ్య సినిమాల కంటే ఎక్కువగానే ఓవర్సిస్ మార్కెట్ లో బిజినెస్ చేశాయి.  ఓవర్సిస్ మార్కెట్ లో ఏ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు