Vijayendra Prasad: లైగర్ సినిమా ప్లాప్ అయిన వెంటనే రాజమౌళి ఫాదర్ పూరి జగన్నాథ్ కి ఫోన్ చేసి ఏం మాట్లాడారంటే

Vijayendra Prasad: ప్రతి దర్శకుడికి సక్సెస్ రావడం ఫెయిల్యూర్ రావటం అనేది కామన్ గా జరుగుతుంది. కొన్ని ఫెయిల్యూర్స్ మాత్రం తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఒకవైపు చాలా డబ్బులు పోవడంతో పాటు ఉన్న రెస్పెక్ట్ ని కూడా తీసుకెళ్లి పోతాయి అని చెప్పాలి. కొరటాల శివ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. అయితే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా తీవ్రమైన డిజాస్టర్ అయింది. అక్కడితో కొరటాల శివ అప్పటివరకు ఇచ్చిన సక్సెస్ సినిమాలన్నీ కూడా చాలామంది మర్చిపోయారు. ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ మాత్రమే గుర్తుపెట్టుకున్నారు.

ఇక పూరి జగన్నాథ్ కెరీర్ విషయానికొస్తే ఎన్నో సినిమాలు సక్సెస్ తో పాటు డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ పూరీ కెరీర్ లో బీభత్సమైన డిజాస్టర్ అంటే లైగర్ అనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేక పోయింది. అసలు పూరి జగన్నాథ్ ఇటువంటి సినిమా తీశాడు అని చాలామందికి డౌట్ కూడా వచ్చింది. పెద్దగా కథ, కథనం లేని ఈ సినిమాలో అసలు పూరి జగన్నాథ్ ఏం నమ్మాడో ఎవరికి అర్థం కాలేదు. అలానే ఈ సినిమాను విజయ్ దేవరకొండ ఎలా ఓకే చేశాడు అని ఆలోచన కూడా చాలామందికి మొదలయ్యాయి. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ రావడంతో జనగణమన ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు.

Liger

- Advertisement -

ఇకపోతే లైగర్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ ముంబై కి మకాం మార్చేశారు. లైగర్ సినిమా అప్పుడు పూరి జగన్నాథ్ కి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పూరి జగన్నాథ్ కి కాల్ చేశారు. సార్ మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తారో తెలియదు. కానీ మీరు నెక్స్ట్ సినిమా చేసే ముందు నాకు ఒకసారి కథ చెప్తారా అని అడిగారట. పూరి జగన్నాథ్ అంటే విజయేంద్ర ప్రసాద్ కి ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్ గా చెబుతూ వచ్చారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు డిజాస్టర్ సినిమాలు తీయడం మాలాంటి వాళ్లకు నచ్చదు అంటూ మాట్లాడారు విజయేంద్రప్రసాద్. అయితే మొత్తానికి విజయేంద్రప్రసాద్ కి కథ చెప్పకుండానే ఈ సినిమాను చేశారట పూరి. ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ తన మాటల్లో చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు