Vijaykanth: నాలుగేళ్ల నిరీక్షణ.. అయినా తీరని చివరి కోరిక..!

Vijaykanth: ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పలు అనారోగ్యాల కారణంగా తమ చివరి కోరికలను తీర్చుకోకుండానే స్వర్గస్తులవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ నటుడు డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ కూడా నాలుగేళ్లుగా తన కోరికను నెరవేర్చుకోవాలని నిరీక్షించి.. ఆ కోరిక నెరవేరకుండానే స్వర్గస్తులయ్యారు. అసలు విషయంలోకి వెళితే విజయ్ కాంత్ కు ఇద్దరు కుమారులు విజయ ప్రభాకరన్ , షణ్ముఘ పాండియన్.. చిన్న కుమారుడు షణ్ముఘ తండ్రి అడుగుజాడల్లోనే తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మారారు.. అయితే పెద్ద కుమారుడు విజయ ప్రభాకరన్ మాత్రం వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా చలామణి అవుతున్నారు. విజయకాంత్ స్థాపించిన రాజకీయ సంస్థ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) పార్టీ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.

ఇక 2019 డిసెంబర్ లో విజయ ప్రభాకరన్ కోయంబత్తూర్ కి చెందిన వ్యాపారవేత్త ఇళంగో కుమార్తె కీర్తనతో సన్నిహితులు, బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో అనారోగ్య కారణాలవల్ల నిశ్చితార్థ వేడుకకు విజయ్ కాంత్ హాజరు కాలేకపోయారు. అయితే ఈ జంటకు నిశ్చితార్థం జరిగి ఇప్పటికీ నాలుగేళ్లు అవుతోంది.

అయినా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి విషయంలో పలు ఊహాగానాలు సినీ పరిశ్రమతో పాటు విజయ్ కాంత్ అభిమానులు కూడా జోరందుకున్నాయి. అయితే విజయ్ కాంత్ సన్నిహితులు చెబుతున్న ప్రకారం.. వారి నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల తర్వాత కరోనా మహమ్మారి బయటపడింది. దాంతో వివాహ ప్రణాళికలలో అనేక మార్పులు జరిగాయి. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పెళ్లి పనులు ఏర్పాటు చేసుకుందామనుకుంటే.. ఆ పెళ్లి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీలు కాలేదు. మోదీ చేతుల మీదుగా తన కుమారుడి పెళ్లి జరగాలని విజయ్ కాంత్ ఆశించారు.

- Advertisement -

అయితే మోదీ ఆ సమయంలో బిజీగా ఉండడం వల్ల పెళ్లికి తేదీలు కేటాయించలేకపోయారు. దీంతో 2022లో కూడా ఈ పెళ్లికి బ్రేకులు పడ్డాయి. ఇక కొన్ని రోజులకి మోదీ నుంచి ప్రకటన వచ్చినా విజయ్ కాంత్ ఆరోగ్యం ఇంకా క్షీణించడంతో పెళ్లి వాయిదా పడింది. అలా ప్రధాని మోదీ సమక్షంలో తన కుమారుడి పెళ్లి జరగాలని విజయ్ కాంత్ ఎంతో అనుకున్నారు .కానీ ఆ కోరిక తీరకుండానే స్వర్గస్తులయ్యారు. ఇకపోతే రేపు పొద్దున విజయ్ ప్రభాకరన్ పెళ్లి జరిగినా.. ఆ పెళ్ళికి మోదీ రావచ్చు కానీ ఆ వేడుకలను చూడడానికి విజయ్ కాంత్ లేకపోవడం అభిమానులను మరింత కలవరపరుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు