Vikram About Prabhas: ప్రభాస్ పై విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vikram About Prabhas: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నటులలో విలక్షణమైన నటుడు చియాన్ విక్రమ్. పేరుకు కోలీవుడ్ నటుడు అయినా కూడా చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులకు ఇష్టమైన హీరో విక్రమ్ అని చెప్పాలి. విక్రమ్ చేసిన ఎన్నో తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. అయితే అన్నిటిని మించి విక్రమ్ శివపుత్రుడు(Siva Putrudu) సినిమా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. విక్రమ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని ప్రూవ్ చేసిన సినిమా శివపుత్రుడు. ఇక శంకర్(Shankar) దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు(Aparichithudu) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శంకర్ ఏ సినిమా చేసిన తమిళతో పాటు ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అలానే అపరిచితుడు సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో విక్రమ్ కనిపించిన విధానం నటించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మూడు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కోసం కూడా చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం రంజిత్(Ranjith Pa) దర్శకత్వంలో తంగలన్ అనే సినిమాను చేశాడు విక్రమ్. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దాదాపు 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

Tangallan

- Advertisement -

మామూలుగా ఒక సినిమా రిలీజ్ కి ముందు ఆ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేయడం అనేది మామూలు విషయం. కానీ తంగలన్ సినిమాకి సంబంధించి రిలీజ్ తర్వాత కూడా ఆ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేశారు. ముఖ్యంగా తెలుగులో చాలామందికి ఇంటర్వ్యూస్ ఇస్తూ అనేక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగులో మాత్రమే కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు