Anirudh: నాకు విక్రమ్ సినిమా ఇచ్చారు

18 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి,
ఫస్ట్ సినిమాలోని ‘కొలవెరి’ పాటతో సంచలనం సృష్టించాడు అనిరుధ్.
చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు.
విజయ్, రజనీకాంత్, అజిత్.. ఇలా చాలామంది సూపర్ స్టార్ల సినిమాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు తమిళంలో అతనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అతిశయోక్తి కాదు.

తెలుగులో అజ్ఞాతవాసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ మ్యూజిక్ పరంగా మంచి మార్కులే పొందాడు. నాని హీరోగా చేసిన జెర్సీ సినిమాకి మ్యూజిక్కే మేజర్ హైలెట్.

కేవలం సినిమాలతోనే కాక మ్యూజికల్ కన్సర్ట్‌లతో కూడా యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అనిరుధ్. సినిమా ఒక స్థాయిలో ఉంటె తన మ్యూజిక్ తో ఆ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడంలో అనిరుధ్ మ్యూజిక్ కీలక పాత్రను పోషిస్తుంది. హీరో ఎంట్రీ కి అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తనకు తానే సాటి అని చెప్పొచ్చు.

- Advertisement -

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా చేసిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ సినిమాకి అనిరుధ్ అందించిన సాంగ్స్ & బాక్గ్రౌండ్ స్కోర్ కి సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

విక్రమ్ సినిమా హిట్ అయిన సంధర్బంగా కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు లగ్జరీ కారును, సినిమాలో అతిథి పాత్ర చేసిన సూర్యకు రోలెక్స్‌ వాచీని గిఫ్టుగా ఇచ్చారు.
తాజాగా ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి అనిరుధ్ కేరళలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్లో అక్కడి విలేకర్ అనిరుధ్‌కు ఆసక్తికర ప్రశ్న వేశాడు. లోకేష్‌కు కారు, సూర్యకు వాచీ ఇచ్చిన కమల్.. మీకేమీ బహుమతిగా ఇవ్వలేదా అని అడిగాడు. దానికి అనిరుధ్ సమాధానంగా ‘‘నాకు విక్రమ్ సినిమాను ఇచ్చారు. ఇంకేం కావాలి’’ అన్నాడు.

కమల్ హాసన్ సినిమాకి పని చేయాలన్నది అతడి కల.
ఆ కల విక్రమ్ సినిమాతో నెరవేరింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు