Vikram: ఆ తప్పులే.. నా ఆరోగ్యం పాడు చేశాయి..హీరో విక్రమ్ కామెంట్స్..!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో విక్రమ్ ప్రయోగాత్మక హీరోగా పేరు పొందారు. ఎలాంటి పాత్రలోనైనా సరే అవలీలగా నటిస్తూ ఉంటారు. తన కెరియర్ లో ఎన్నో ప్రయోగాత్మకంగా చిత్రాలలో నటించారు విక్రమ్. ప్రతి సినిమాకు కూడా తన బాడీ లాంగ్వేజ్ ను మేకోవర్ n సైతం సినిమాకి తగ్గట్టుగా మార్చుకునే ఏకైక హీరోగా పేరు సంపాదించారు. అలాగే సినిమా కోసం ఎంతటి బరువునైనా సరే తగ్గించగలిగిన సత్తా ఉన్న హీరోగా పేరు సంపాదించారు హీరో విక్రమ్. అయితే విక్రమ్ గురించి తాజాగా కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్..

Vikram: Those mistakes.. ruined my health..Hero Vikram comments..!
Vikram: Those mistakes.. ruined my health..Hero Vikram comments..!

హీరో విక్రమ్.. సినిమా అంటే ప్రాణం పెట్టి మరీ నటిస్తూ ఉంటారు.. అలా ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు.. ఇలా సినిమాల కోసం, లుక్కు కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి చేయడం వల్ల ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపించిందట. ముఖ్యంగా సినిమాల కోసం ఒక్కొక్కసారి విపరీతమైన బరువు తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇన్ని ప్రయోగాల వల్ల హీరో విక్రమ్ ఆరోగ్యాన్ని ఎక్కువగా కోల్పోతున్నాడట. అయినా కూడా తనకు ఎలాంటి బాధ లేదని సినిమా కోసం ప్రాణమైన ఇస్తానని ఎన్నోసార్లు తెలియజేశారు.

దానివల్లే శరీరం అదుపు తప్పింది..

ఇటీవలే ఒక మీడియాతో మాట్లాడుతున్న విక్రమ్.. తను నటించిన సినిమాలలోని కొన్ని పాత్రల వల్ల తన ఆరోగ్యం చాలా పాడైపోయింది అంటూ తెలియజేశారు.. బరువు తగ్గడానికి రోజులో కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేసేవారని.. అది కూడా ఒక చపాతి.. క్యారెట్ జ్యూస్ లేకపోతే ఒక ఎగ్ లో వైట్ భాగం మాత్రమే తినేవాడినట్టు తెలియజేశారు. ఇలా తిన్న తర్వాత సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లే వాడినని తెలియజేశారు విక్రమ్. ఇలా సినిమా కోసం ఒకసారి బరువు తగ్గి మరొకసారి పెరుగుతూ ప్రయోగాలు చేయడం వల్ల తన శరీరం అదుపుతప్పి చాలా ఇబ్బందులకు గురైందని కూడా తెలిపారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ సరికొత్త ప్రయోగాలను చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ తెలియజేశారు విక్రమ్.

- Advertisement -

విక్రమ్ సినిమాలు..

ప్రస్తుతం విక్రమ్ సినిమాల విషయానికి వస్తే.. తంగలాం అనే సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఈ సినిమాలో విక్రమ్ లుక్ కూడా చాలా భయంకరంగా కనిపిస్తోంది. మరి ఏ మేరకు విక్రమ్ తన సినిమాతో ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అవుతారో చూడాలి మరి. విక్రం సరైన సక్సెస్ అందుకోక ఇప్పటికి చాలా కాలమవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు