SanthanaPrapthirasthu : ఈ హీరో తప్పు తెలుసుకునట్టున్నాడు.. ఈసారైనా కొట్టేస్తాడా?

SanthanaPrapthirasthu : టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ ఎంతో ట్రోలింగ్ కి గురైన సినిమాల్లో స్పార్క్ అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో విక్రాంత్ అనే కొత్త హీరో నటించగా, భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా దారుణంగా ప్లాప్ అయింది. అందరికంటే ఎక్కువగా హీరో బాగా ట్రోల్ అయ్యాడు. సినిమాలో ఒక రోబోలా నటించాడు తప్ప, మనిషిలా హావభావాలు ప్రకటించలేదు అని, నెటిజన్లు ట్రోల్ చేసారు. ఒకే ఎక్స్ప్రెషన్ తో సినిమాలో నటించాడని పైగా యాక్షన్ హీరోగా ఇతనికి సినిమాలు అవసరమా అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసారు. ఇక దానికి హీరో కొన్నాళ్ల పాటు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా ఏడాది తర్వాత ఈ హీరో మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు.

Vikranth starrer Santhana Prapthirasthu movie first look released

తప్పు తెలుసుకున్నాడు.. ఈసారి కొత్తగా..

ఇక హీరో విక్రాంత్ తన గత చిత్రంతో దారుణంగా విమర్శల పాలయ్యాడు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు తనకు సెట్ అవవని రియలైజ్ అయ్యాడో ఏమో, ఈసారి ఎంటర్టైన్మెంట్ జోనర్ లో వస్తున్నాడు. కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని రాబోయే సినిమాలో కామన్ మ్యాన్ గా కనిపించనున్నాడు. ఇక విక్రాంత్ హీరోగా తాజాగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ (SanthanaPrapthirasthu) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా మధురా ఎంటర్ టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్టు సమాచారం. ఏబీసీడి సినిమా డైరెక్టర్ చేసిన సంజీవ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. ఆ పోస్టర్ లో హీరో చేతిలో ఉన్న వస్తువులు, చుట్టూ ఉన్న ఫ్రూట్స్, కూరగాయాల ఐటమ్స్, ఏదో వీర్యకణాలకి సంబంధించిన బుక్ తో కామెడీ బాగానే ట్రై చేస్తున్నట్టు ఉంది.

- Advertisement -

ఈ సినిమాలో హీరో ఇక మిడిల్ క్లాస్ కి చెందిన సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించబోతున్నాడట. అతనికి ఉండే ఒక సమస్యతో సినిమా చాలా ఫన్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక స్పార్క్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విక్రాంత్ ఈ సినిమాతో తనకి సూట్ అయ్యే సింపుల్ స్క్రిప్ట్ ని, బలమైన కంటెంట్ ఉన్న కథని ఎంచుకున్నాడని అంటున్నారు నెటిజన్లు. ఇటు ట్రేడ్ విశ్లేషకులు కూడా సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో సక్సెస్ కొట్టెలనే ఉన్నాడని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు