Vinay Varma : భజన చేసేంత టాలెంట్ నాలో లేదు – వినయ్ వర్మ

Vinay Varma : సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావాలంటే ట్యాలెంట్ తో పాటు మ‌రో ప్ర‌తిభ కూడా ఉండాల‌ని అంటుంటారు. అదే భ‌జ‌న చేయ‌డం. ప‌రిశ్ర‌మ‌లో ట్యాలెంట్ కంటే కూడా ముఖ్య‌మైనదిగా దీన్ని కొంద‌రు భావిస్తుంటారు. ఈ భ‌జ‌న అన్న‌ది అన్ని రంగాల్లో ఉన్న‌దే. అయితే సినీ ప‌రిశ్ర‌మ‌లో మాత్రం ఇంకాస్త ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తుంది. ఇక్క‌డున్న సంఘాల కార‌ణంగానే భ‌జ‌న అనే అంశం ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తుంది.ఎప్పటికప్పుడూ దాని ప్రాధాన్య‌త పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా తెలుగు, హిందీ భాషల్లో మంచి పాత్రలతో మెప్పిస్తున్న నటుడు విన‌య్ వ‌ర్మ ఇదే అంశం గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడారు. విన‌య్ వ‌ర్మ చాలా సినిమాల్లోనే న‌టించారు. తెలుగుతో పాటు హిందీ సినిమాలు చేసారు. అలాగే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ల్లో కూడా న‌టించారు. ఆయ‌న వాయిస్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. అయితే విన‌య్ వ‌ర్మ (Vinay Varma) అంత‌గా పాపుల‌ర్ కాలేదు. ట్యాలెంట్ ఉన్నా? ఎందుక‌లా జ‌రిగింది అనే ప్ర‌శ్న ఆయ‌న ముందుకు తీసుకెళ్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

Vinay Varma's interesting comments about the film industry

భజనలు మన వాళ్ళ కాదు..

నటుడు వినయ్ వర్మ మాట్లాడుతూ ‘ఇక్కడ అవకాశాలు రావాలంటే టచ్ లో ఉండాలి. గుడ్ మార్నింగ్ లు, గుడ్ నైట్ మెసేజ్ లు పెట్టాలి. పని ఉన్నా లేకపోయినా కాల్స్ చేస్తూ ఉండాలి. కానీ అలా భజన చేసే టాలెంట్ భగవంతుడు నాకు ఇవ్వలేదు. ఇస్తే బాగానే ఉండేదేమో. ఒకరి సమయాన్ని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందువల్లనే నేను ఎవరికీ కాల్ చేయను. పాత్ర పరంగా సహజత్వానికి దగ్గరగా ఉన్నవి చేయాలనిపిస్తుంది. అలాంటి పాత్రలు చేయడం కష్టం కాబట్టి, నన్ను నేను నిరూపించుకోవాలనిపిస్తుంది. నేను ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వను. వాళ్లు వినలేదని బాధపడను. నేను కాస్త ముక్కు సూటి మనిషిని. అందువలన నా ధోరణి అందరికీ నచ్చకపోవచ్చు. ముక్క‌సూటి మ‌నుషుల‌తో వ్య‌వ‌హారం ఎలా ఉంటుందో తెలుసుగా’ అని అన్నారు. వినయ్ వ‌ర్మ‌లాగే ట్యాలెంట్ ఉన్న కొంత మంది కూడా భ‌జ‌న ట్యాలెంట్ లేక‌పోవ‌డంతో అవ‌కాశాలు రావ‌డం లేద‌ని, సినిమా అవ‌కాశాలు రావాలంటే ప్ర‌తిభ‌తో పాటు ర‌క‌ర‌కాల ప్యాక్ట‌ర్లు ప‌ని చేస్తాయ‌ని చెప్పుకొచ్చారు.

- Advertisement -

విలక్షణ నటుడు మాత్రమే కాదు… డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..

ఇక నటుడు వినయ్ వర్మకి గుర్తింపు రావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో గురు, డియర్ కామ్రేడ్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో నటుడుగా అలరించారు. అయితే వినయ్ వర్మ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తెలుగు వాడు కావడం వల్ల, మంచి గంభీరమైన గొంతు ఉన్న వినయ్ వర్మ పలు విలన్ పాత్రలకి డబ్బింగ్ చెప్పారు. తెలుగులో చిరంజీవి అంజి లో ముసలి విలన్ అయిన టిన్ను ఆనంద్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది వినయ్ వర్మనే. అలాగే ఒక్కడున్నాడు లో నాజర్ కి, డియర్ కామ్రేడ్ లో రాజ్ అర్జున్ కి ఇలా కొన్ని సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ కొనసాగుతున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు