Virat Kohli: కైసే హై చిరు గారు..! మెగాసార్ ను పలకరించిన రన్ మెషిన్..

Virat Kohli : భారత క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ అంటే యూత్ కు చాలా ఇష్టం.. ధోని తర్వాత హెలికాఫ్టర్ షార్ట్స్ తో ఇండియా టీమ్ ను గెలిపిస్తున్నాడు.. కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్ని మ్యాచ్ లు టీమ్ ఇండియా గెలిచింది. ఈయన సామాన్య ప్రజలతో పాటుగా సినీతారల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు.. కోహ్లీ ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి సెలెబ్రెటీలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.. చిరుకు కోహ్లీ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు..

ఇండియా మ్యాచ్ ఉన్న ప్రతిసారి చిరంజీవి కోహ్లీ ఆట తీరుపై ప్రశంసలు కురిపిస్తుంటారు.. ఇక కోహ్లీ కూడా చిరుకు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.. చిరు పాటలకు కోహ్లీ డ్యాన్సులు కూడా చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఆ వీడియోలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతుంటాయో చూస్తుంటాం.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

ఆ పోస్ట్ లో కోహ్లీ చిరును ఆప్యాయంగా పలకరించారు. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. ఆరేళ్ళ తర్వాత కోహ్లీని కలిశాను. విరాట్ నా మొదటి ఆటగాడు. చిరంజీవికి పెద్ద ఫ్యాన్స్ అని అందులో పేర్కొన్నారు. అండర్ 15 రోజుల్లో ఉన్నప్పుడు రూమ్‌మేట్స్‌గా ఉన్నాము. చిరంజీవి పాటలకు డ్యాన్స్ కూడా చేసేవాడని అందులో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చేసింది కోహ్లీ పాత స్నేహితుడు. ద్వారకా రవితేజ .. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. మెగాస్టార్ వయసు పెరుగుతున్న సినిమాలను చేస్తున్నాడు. కోహ్లీ మాత్రం ప్రస్తుతం కొద్దీ రోజులు మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నారని తెలిసిందే..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు