మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ లు జంటగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు నుండే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటనకు గాను హీరో సాయిధరమ్ తేజ్ కి, హీరోయిన్ సంయుక్త మీనన్ కి ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాను డీల్ చేసిన విధానానికి విమర్శకులు సైతం ఫిదా అవుతున్నారు.
రిలీజ్ కి ముందు డీసెంట్ బిజినెస్ చేసిన ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ స్టేజ్ కి చేరుకుంది. ఇదే టాక్ గనక కంటిన్యూ అయితే తేజ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. ఇక విషయానికి వెళితే మలయాళీ భామ సంయుక్త మీనన్ తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వటంతో ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని పిలుస్తున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియా వారు ఇదే అంశంపై ప్రశ్నించగా అందుకు స్పందించిన డైరెక్టర్ కార్తీక్ సంయుక్త ది గోల్డెన్ లెగ్ కాదు ఇరాన్ లెగ్ అని, తన వల్లే తేజ్ కి ఆక్సిడెంట్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేసారు.
డైరెక్టర్ మాటలకి షాక్ అయిన హీరోయిన్, అతని వైపు కొంచెం కోపంగా చూసేసరికి తేరుకొని తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేసాడు. సినిమా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్ అంటూ ఉండదని వివరణ ఇస్తూ, బింబిసార సినిమాకంటే ముందే సంయుక్త విరూపాక్ష సినిమా సైన్ చేసిందని, తను వచ్చాకే తేజ్ కి యాక్సిడెంట్ అయిందంటూ డైరెక్టర్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు అక్కడి వారందరిని ఆశ్చర్య పరిచాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News