Ravikrishna : తినడానికి అన్నం కూడా లేని రోజులు గడిపాను.. – విరూపాక్ష ఫేమ్ రవికృష్ణ

Ravikrishna : టాలీవుడ్ లో సీరియల్ నుండి సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఎంతో టాలెంట్ ఉన్న నటుల్లో రవికృష్ణ ఒకరు. ఈ పేరు వింటే కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ వీరూపాక్షలో భైరవ అంటే మాత్రం ఇట్టే చెప్పేస్తారు. సినిమాకి హైలెట్ అయిన పాత్రల్లో భైరవ పాత్ర కూడా ఒకటి. భైరవ పాత్రలో అద్భుతంగా నటించిన రవికృష్ణ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. బుల్లితెరపై సీరియల్స్ లో స్టార్ హీరోగా పలు సీరియల్స్ లో నటించాడు రవి కృష్ణ. దాదాపు టెలివిజన్ లో 12 ఏళ్ల పాటు సీరియల్స్ లో నటిస్తుండగా, శ్రీనివాస కల్యాణం, వరూధిని పరిణయం, మనసు మమత, బావా మరదళ్లు, వంటి సూపర్ హిట్ సీరియల్స్‌ లో మెయిన్ లీడ్ రోల్స్‌ లో హీరోగా నటించిన రవికృష్ణ ఇప్పుడు పూర్తిగా సినిమాల్లోనే బిజీ అయ్యాడు. లేటెస్ట్ గా ది బర్త్ డే బాయ్ అనే సినిమాలో నటించిన రవికృష్ణ ఆ సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో తానూ ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకున్నాడు.

Virupaksha fame Ravi krishna talks about his struggles in the industry

అన్నం లేక నిమ్మకాయ నీళ్లు తాగిన రోజులున్నాయి – రవికృష్ణ

లాస్ట్ ఇయర్ విరూపాక్ష సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిన రవికృష్ణ (Ravikrishna) రీసెంట్ గా లవ్ మీ సినిమాలో కూడా సెకండ్ లీడ్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా ది బర్త్ డే బాయ్ సినిమాలో నటించిన రవి, ఆ సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో ఎదుర్కున్న అనుభవాల్ని పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… డిగ్రీ ఫినిష్ అయిన వెంటనే ఇండస్ట్రీలోకి రావాలని మైండ్ లో ఫిక్స్ అయ్యానని, ఫ్యామిలీతో బలవంతంగా ఒప్పించి, చెన్నై వెళ్లిపోయానన్నాడు. కానీ ఇండస్ట్రీకి ఏమి తెలీకుండా వెళ్లడం తన తప్పయింది అన్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఓ 5వేలు తీసుకొని వచ్చానని, కాని ఆ డబ్బులు కొన్ని రోజులకే అయిపోయాయని, దీంతో ఒక టైం లో ఫుడ్ లేక, ఎక్కడుండాలో కూడా తెలీని టైం లో జేబులో ఓ రెండు రూపాయలు ఉంటే నిమ్మకాయ కొనుక్కొని.. ఒక బోరు పంపు నీళ్ల లో నిమ్మకాయ కలుపుకొని కడుపు నింపుకున్నానని చెప్తూ రవికృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

- Advertisement -

ఫైనాన్షియల్ గా ఎన్నో కష్టాలు పడ్డాం..

ఇక రవికృష్ణ తన ఫ్యామిలీ గురించి చెప్తూ.. మాది పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదని, మా నాన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ అని, ఇంట్లో చిన్నప్పటి నుండే ఫైనాష్షియల్‌ గా చాలా కష్టాలు పడ్డామని చెప్పుకొచ్చాడు. అందుకే ఇండస్ట్రీ కి వచ్చాక తన కష్టాలు చెప్పి ఫ్యామిలీ ని బాధ పెట్టలేక అలానే కొన్ని రోజులు గడిపేసానని చెప్పుకొచ్చాడు. ఇక బుల్లితెరపై అసిస్టెంట్ డైరెక్టర్ గా ఓ డైరెక్టర్ దగ్గర ఓ సీరియల్ కి పని చేస్తూ, అదే సీరియల్ ఆడిషన్ లో డైరెక్టర్ ని మెప్పించి హీరో అయ్యానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీ అవుతున్న రవికృష్ణ సీరియల్స్ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు